Dengue Vaccine : ప్రజలకు గుడ్ న్యూస్... ప్రమాదకరమైన డెంగ్యూకి... వ్యాక్సిన్ వచ్చేసింది...!
engue Vaccine : వర్షాకాలం దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. తద్వారా డెంగ్యూ జ్వరం వచ్చే అవకాశం కూడా ఎక్కువే. డెంగ్యూ జ్వరం వచ్చిన తరువాత తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. దీనిని పెంచుట కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొందరికి మరణం కూడా వస్తుంది. రక్త కణాల సంఖ్య చాలా తగ్గిపోతే మరణం సంభవిస్తుంది. తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుకొనుటకు యాంటీబయోటిక్స్ మాత్రమే ఇచ్చేవారు. అయితే ఇప్పుడు పనాసియా బయోటెక్ అభివృద్ధి చేసిన టెట్రా వాలంటీ డెంగ్యూ వ్యాక్సిన్ ని మూడో దశ క్లినికల్ ట్రైల్స్ లో విజయవంతంగా ఉంది. యూఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ( NIH ) సహకారంతో అభివృద్ధి చేయబడిన ఈ వ్యాక్సిన్ నాలుగు రకాల డెంగ్యూ వైరస్ ల నుండి రక్షణ అందిస్తుంది.
Dengue Vaccine : ప్రజలకు గుడ్ న్యూస్… ప్రమాదకరమైన డెంగ్యూకి… వ్యాక్సిన్ వచ్చేసింది…!
డెంగి ఆల్ పేరుతో యూఎస్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ( NIH ) సహకారంతో పనాసియా బయోటికాభివృద్ధి చేసిన టెట్రావాలంటు డెంగ్యూ వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇది 4 డెంగ్యూ వైరస్రతో టైపుల నుండి రక్షించడానికి రూపొందించిన లైవ్- అటేన్యూయేటేడ్ టీకా. ఈ టీకా ప్రస్తుతం భారతదేశంలో మూడో దశ క్లినికల్ ట్రైల్స్ లో ఉంది. దీనిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR ) భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. ICMR శాస్త్రవేత్తల ప్రకారం స్వదేశీ వన్- షాటు పనాసియా బయోటెక్ అభివృద్ధి చేసిన డెంగ్యూ వ్యాక్సిన్ దేంగి ఆల్… ఫెజ్ 3 క్లినికల్ ట్రయల్ అక్టోబర్ నాటికి భారతదేశంలోని 20 కేంద్రాలలో దాదాపు 10, 500 మంది వాలంటరీల నమోదు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు పూణే,చెన్నై,కోల్కత్తా, ఢిల్లీ, భువనేశ్వర్ లోని వివిధ కేంద్రాలలో 8,000 మంది పాల్గొన్నారు.ICMR, పనాసియా బయోటెక్ స్పాన్సర్ చేసిన ట్రయల్లో భాగంగా టీకా లేదా ప్లేసి బోను పొందారు. ఈ ట్రయల్ ను పూణేలోని ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ వైరాలజీ అండ్ AIDS పరిశోధన చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏపీ డేమియాలజీ(NIE ), పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో డెంగ్యూ వ్యతిరేకంగా, యాంటీ వైరల్ చికిత్స లేదా లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ లేదు. ఒకటి రెండు ట్రయల్ దశలో ఫలితాలు వన్ షాట్ వ్యాక్సిన్ కు ఎటువంటి భద్రత సమస్యలను చూపించలేదని NIE డైరెక్టర్ డాక్టర్ మనోజ్ ముర్హహేకర్ అన్నారు. మూడోదశ ట్రయాల్లో భాగంగా టీకాలు వేయించుకున్న వారిని రెండేళ్ల పాటు పర్యవేక్షిస్తారు. ఈ ట్రెట్రావాలంటే డెంగ్యూ వ్యాక్సిన్ సామర్ధ్యాన్ని ఈ trayale అంచనా వేస్తుందని డాక్టర్ ముర్హేకర్ వెల్లడించారు.
టీకా సమర్థత,భద్రత,దీర్ఘకాలిక రోగానిరోధక శక్తి అంచనా వేయడానికి మల్టీ – సెంటర్,బ్లైండ్ రాండా మైసేడ్ ప్లసిబో నియంత్రిత మూడోదశ ట్రయల్ గత సంవత్సరం ఆగస్టులో ప్రారంభించారు. ఈ ట్రయల్ మొదట పాల్గొనే వారికి గత సంవత్సరం రోహ్ తక్ ని పండిట్ భగవత్ దయాలు శర్మ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (PGIMS) లో టీకాలు వేశారు. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIE) మొదట అభివృద్ధి చేసిన టెట్రావాలంటు డెంగ్యూ వ్యాక్సిన్ స్టేయిన్ (TV003/TV005) బ్రెజిల్ క్లినికల్ ట్రైల్స్ లో ఆశాజనకమైన ఫలితాలను చూపించిందని, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గతంలో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్ట్రేయెన్ ఎన్నో స్వీకరించిన మూడు భారతీయ కంపెనీలలో ఒకటైన పనాసియా బయోటిక అభివృద్ధిలో అత్యంత అదునాథన్ దశలో ఉంది.
పూర్తిస్థాయి వ్యాక్సిన్ ఫార్ములేషన్ను అభివృద్ధి చేయడానికి ఈ ట్రైన్లపై కంపెనీ విస్తృతంగా పనిచేస్తుంది ఈ పనికి ప్రాసెస్ పెంట్ ను కలిగి ఉంది.
ఇండియాలో డెంగ్యూ ప్రధాన సమస్య : దేశంలో డెంగ్యూ ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉంది.ఈ వ్యాధి అత్యధికంగా ఉన్న టాప్ 35 దేశాలలో మన దేశం కూడా ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం 2023 చివరి నాటికి 129 కంటే ఎక్కువ దేశాలు డెంగ్యూ వైరల్ వ్యాధిని నివేదించడంతో గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ సంభవం క్రమంగా పెరుగుతుంది. భారతదేశంలో దాదాపు 75 నుంచి 80% ఇన్ఫెక్షన్ లో లక్షణ రహితంగా ఉన్నాయి. అయినప్పటికీ,ఈ వ్యక్తులు ఇప్పటికీ ఆడ దోమలు కాటు ద్వారా ఇన్ఫెక్షన్ను వ్యాప్తి చేయవచ్చు. దీని లక్షణాలు వైద్య పరంగా స్పష్టంగా కనిపించే 20 నుంచి 25% కేసులలో పిల్లలు ఆసుపత్రిలో చేరడం, మరణాల ప్రమాదం ఎక్కువగా ఉంది. పెద్దవారిలో ఈ వ్యాధి డెంగ్యూ హేమరేజిక్ జ్వరం,డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వంటి తీవ్రమైన పరిస్థితిలకు దారి తీస్తుంది. ప్రభుత్వా గుణాంకాల ప్రకారం.. ఈ సంవత్సరం మార్చి వరకు దాదాపు 12043 డెంగ్యూ కేసులు నమోదయి.2024లో 2.3 లక్షల కేసులు 297 మరణాలు నమోదయ్యాయి.
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్‌వర్డ్‌ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్‌వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్‌తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌కు సమయం…
Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…
This website uses cookies.