Health Benefits : బొప్పాయి పండు గురించి దాని వల్ల కలిగే లాభాల గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. నిజానికి ఎంతో రుచిగా ఉండే ఈ పండును తినేందుకు అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే పూర్వం రోజుల్లో కూరగాయలు ఎక్కువగా దొరకనప్పుడు పచ్చి బొప్పాయితో కూర చేసుకుని తినేవారట. కానీ గర్భంతో ఉన్నవారి, నెలసరిలో ఉన్న వారు మాత్రం బొప్పాయిని అస్సలే తినకూడదని చెబుతుంటారు. ఎందుకంటే బొప్పాయిలో ఉండే లాక్టేన్ గర్భాశంలో ఎక్కువ కదలికలు వచ్చేలా చేసి గర్భంలో పిండం బయటకి వచ్చేలా చేస్తుందట. అందుకే గర్భిణీ మహిళలను బొప్పాయి తనికూడదని ఒక వేళ తింటే గర్భస్రావం అవుతుందని చెబుతుంటారు. అయితే నెలసరి మసయంలో తనిడం వల్ల గర్భాయంలో కదరిలకల కారణంగా ఫ్లో ఎక్కువై… అధిక రక్త స్రావం అవుతుంది.
అయితే ఇది నిజమేనని ఎలుకలకు చేసిన ఓ పరిశోధనలో తేలింది. గర్భంతో ఉన్న ఎలుకలకు పచ్చి బొప్పాయి పెట్టడంతో గర్భస్రావం అయింది. కానీ పండు బొప్పాయి తింటే ఎలాంటి సమస్యా ఉండదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.అయితే బొప్పాయిలో పపైన్ అనే రసాయనం ఉంటుంది. పపైన్ ప్రోటీన్లు, కార్బో హైడ్రేట్లు, కొవ్వులను విచ్ఛిన్నం చేస్తుంది. అందుకే ఇది మాంసం టెండరైజర్ గా పని చేస్తుంది. అయినప్పటికీ పపైన్ జీర్ణ రసాల ద్వారా మార్చబడుతుంది కాబట్టి నోటి ద్వారా తీసుకున్నప్పుడు అది ఔషధంగా పనిచేసస్తుందట. అంతే కాకుండా బప్పాయిలో ఉన్న కార్పెయిన్ రసాయనం.. శరీరంలో ఉండే కొన్ని పరాన్న జీవులను చంపేస్తుందట. అంతే కాకుండా కేంద్ర నాండీ వ్యవస్థను ప్రభావితం చేస్తుందట. బొప్పాయిని తీసుకోవడం పిత్తాశయం మరియు కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పులియబెట్టిన బొప్పాయిని ప్రతిరోజూ రెండు నెలల ప టు తీసుకోవడం వల్ల మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. బొప్పాయిని తీసుకోవడం వల్ల హెచ్ పీ వీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతందని కూడా పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అలాగే బొప్పాయిని నోటి ద్వారా పెద్ద మొత్తంలో తీసుకున్నప్పుడు లేదా చర్మానికి బొప్పాయి పాలు తగిలిన మంచిది కాదని సూచిస్తున్నారు. అందుకే పెద్ద మొత్తంలో బొప్పాయిని నోటి ద్వారా తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల అన్నవాహిక దెబ్బతింటుంది. బొప్పాయి పాలను చర్మానికి పూయడం వల్ల కొంత మందిలో తీవ్రమైన చికాకు మరియు అలెర్జీ ప్రతిచర్యలు సంభవించవచ్చు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.