అల్ల నేరేుడు పండ్ల గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. నల్లగా నిగనిగలాడుతూ.. కాస్త పులుపూ, వగరుతో పాటు తియ్యగా ఉండే ఈ పండ్లలో అనేకమైన పోషకాలు ఉంటాయి. అయితే ఈ పండ్లు ఎక్కువగా వేసవి కాలంలో దొరుకుతాయి. అల్ల నేరేడు పండ్లు, గింజలు, ఆకులు, చెట్టు బెరడు… ఇలా అన్నింటినీ ఆయుర్వేదంలోని అనేక ఔషధాల్లో ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు జామున్ చాలా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జామున్ తినడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని వివరిస్తున్నారు. జామున్ విత్తనాలు మధుమేహ రోగులకు చాలా ఉఫయోగపడతాయని చెబుతున్నారు.
జామున్ గింజలను పొడి చేసుకొని నీటిలో కలుపుకొని తాగడం వల్ల మధుమేహానికి చెక్ పెట్టొచ్చని పేర్కొంటున్నారు. అయితే కేవలం మధుమేహులకే కాకుండా మిగతా వారిలో కూడా అనేక రకాల సమస్యలను తరిమికొట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయట.అల్లనేరేడు గింజలను ఎండబెట్టి పొడి చేసి డబ్బాలో నిల్వ చేసుకోవాలి. మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఈ పొడి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జామున్ గింజల్లో జంబోలిన్, జాంబోసిన్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర విడుదల ప్రక్రియను నెమ్మదిగా మార్చి ఇన్సులిన్ స్థాయిని పెంచుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం తీసుకునే ముందు ఈ పొడిని తీసుకోవాలి. అయితే ముందుగా అల్ల నేరేడు పండ్లను శుభ్రంగా కడుక్కోవాలి. గుజ్జు నుంచి గింజలను వేరు చేయాలి.
ఆ తర్వాత విత్తనాలను మరో కడిగి పొడి బట్టపై ఉంచి తడి ఆరనివ్వాలి. ఆ తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిన తర్వాత వాటి బరువు తగ్గినట్లు అనిపిస్తుంది. అప్పుడు వాటిపై ఉండే తొక్కను తీసేసి గింజలను మెత్తగా పొడి చేసుకోవాలి.అయితే ఈ పొడిని ప్రతిరోజూ ఉదయం పరగడపున నీళ్లలో కానీ పాలల్లో కాని కలుపుకొని తాగాలి. ముఖ్యంగా మధుమేహులు ప్రతిరోజూ ఈ పొడిని తీసుకోవడం వల్ల డయాబెటిక్ రోగుల రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేయవచ్చు. అలాగే కడుపులో వచ్చే అనేక రకాల సమస్యలను కూడా ఈ పొడి తగ్గిస్తుంది. కడుపు నొప్పి, అజీర్తి తగ్గుతాయి. రోగనిరోధక శక్తి విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా రక్తహీనత వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉండే ఈ జామున్ గింజల పొడిని పెరుగులో కలుపుకొని తింటే ఉపశమనం కల్గుతుంది.
Tollywood : సినీ పరిశ్రమలో ఏదైనా సమస్య ఉంటే పెద్దదిక్కుగా వచ్చి ఆ సంస్యకు పరిష్కారం చూపించి.. పెద్దన్నగా అండగా…
Jr NTR : పుష్ప 2 ప్రీమియర్ షో వల్ల మహిళ మృతికి అల్లు అర్జున్ కూడా కారణమే అని…
Jio : రిలయన్స్ జియో తన కొత్త ₹2,025 న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ను ప్రారంభించింది. జియో మొబిలిటీ వినియోగదారులకు…
Ys Jagan : మాజీ సీఎం జగన్ ఇప్పుడు రూటు మార్చారు. వచ్చే ఎన్నికలలో తమ సత్తా చాటాలని భావిస్తున్న…
New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం పేదలకి అనేక శుభవార్తలు చెబుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలకు…
Chiranjeevi : సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ రేవతి మృతి కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు…
Producer Naga Vamsi : ప్రస్తుతం టాలీవుడ్ అంతా కూడా గరం గరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సంధ్య…
Papaya Leaf Juice : బొప్పాయి పండు గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ పండు మనకు చాలా తేలికగా…
This website uses cookies.