Health Tips : మనం చాలామందిలో వాళ్ళ శరీరంపై ఎక్కడ పడితే అక్కడ పులిపర్లు ఉండడం చూస్తూనే ఉంటాం. కొన్ని అవయవాలపై పులిపర్లు ఉండి చాలా చిరాకును తెప్పిస్తూ ఉంటాయి. ఇవి బరువు ఎక్కువగా ఉండడం వలన వైరస్ల వల్ల గాని ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించడం వలన కానీ వస్తూ ఉంటాయి. వీటి నుండి బయటపడడం కోసం హాస్పటల్ చూట్టు తిరుగుతూ ఉంటారు. అయితే ఏదో ఒక మూల వాటి తాలూకా మచ్చలు కూడా వస్తూ ఉంటాయి. వాటిని తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ వాటికోసం ఎన్నో రకాల కెమికల్ ఉన్న మందులను వాడుతూ ఉంటారు. అయితే వాటి వలన ఎటువంటి రిజల్ట్ ఉండదు. అయితే వాటికోసం ఇప్పుడు మనం చేయబోయే చిట్కా ఈ చిట్కా వాటి నుంచి బయట
పడేయడమే కాకుండా వాటి తాలూకా మచ్చలు కూడా తగ్గిపోయేలా చేస్తుంది. అయితే దీన్ని మూడు రోజులు వాడవలసి ఉంటుంది. మీరు ఈ చిట్కాని తయారు చేయడానికి వాడేవి అన్ని మన ఇంట్లో దొరుకుతాయి. కాబట్టి వీటి వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. ఇప్పుడు ఈ మిశ్రమం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.. దీనికోసం మొదటగా మనం ఒక బౌల్ని తీసుకొని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ తమలపాకులు వాడే సున్నం వేసుకోవాలి. ఇప్పుడు ఒక అర చెంచా పసుపు కూడా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో ఒక అరచెంచా వంట సోడా కూడా కలుపుకోవాలి. ఈ మూడిటిని కొద్దిగా నీటిని వేసి పేస్ట్ లాగా బాగా కలుపుకోవాలి. ఇది మరీ పల్చగా అవ్వకూడదు. మీరు నొప్పిని తట్టుకుంటాం అనే వాళ్ళు వంట సోడాకు బదులుగా నిమ్మరసం కూడా వాడుకోవచ్చు.ఈ నిమ్మరసం వల్ల కొద్దిగా నొప్పి అలాగే మంట కలిగిస్తుంది.
దీనిలో పసుపు మరియు సున్నం కలపడం వలన మిశ్రమం యొక్క రంగు ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని పులిపర్ల ఉన్న ప్రదేశంలో చిన్నగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తరువాత ఒక 10 నిమిషాలు పాటు అలా వదిలేయాలి. కొద్దిసేపు తర్వాత సాధారణమైన నీటితో ముఖంని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా రోజుకి మూడుసార్లు అప్లై చేయాలి. పులిపర్ల సైజును బట్టి అవి సమయం ఎక్కువ అవుతూ ఉంటుంది. చిన్న పరిమానంలో ఉండేవి రెండు మూడు రోజుల్లో తగ్గిపోతాయి. పెద్ద సైజులో ఉండే పులిపర్లు రాలిపోవడానికి కొద్దిగా ఎక్కువ సమయమే పడుతుంది. ఈ చిట్కాని వాడేటప్పుడు కంటి దగ్గర కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా రోజుకు మూడుసార్లు ఉపయోగించడం వలన మీ పులిపర్లు అలాగే మచ్చలు కూడా తగ్గిపోతాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.