మేష రాశి ఫలాలు : ఈరోజు సానుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి.అనవసర ఖర్చులు చేయవద్దు. అప్పులు తీరుస్తారు. ఆఫీస్‌లో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారాలలో లాభాలు పొందుతారు.శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. కానీ అవసరాలకు మాత్రం ధనం చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. సాయంత్రం నుంచి శుభకాలం. మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : సాధారణంగా గడుస్తుంది. పెద్దగా మార్పులు లేని రోజు. పెద్దల సహకారంతో ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. ఆఫీస్‌లో పరిస్థితులు మీలో మనోధైర్యాన్ని పెంచుతాయి. కుటుంబం సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. నవగ్రహారాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు ఆదాయంలో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తుంది. అన్నింటా మీకు జయం కలుగుతుంది. సమాజ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. మహిళలకు మంచి రోజు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
సింహ రాశి ఫలాలు : నిదానంగా పనులు పూర్తిచేస్తారు. ఆదాయంలో స్వల్ప మార్పులు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. సృజనాత్మక ఆలోచనలు చేస్తారు. ఆనుకోని ప్రయాణాలు. అవసరాలకు డబ్బు అందుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు.వాహన సౌఖ్యం. విందు వినోదాలలో ఉల్లాసంగా పాల్గొంటారు. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.
కన్య రాశి ఫలాలు : చక్కటి సమయం ఈరోజు. మీరు వేగంగా పనులు పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేసే పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు. అన్నింటా మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం. ఇష్టదేవతరాధన చేయండి.
తులారాశి ఫలాలు : కొద్దిగా చికాకులతో కూడినర ోజు. వాదాలు, వివాదాలకు దూరంగా ఉండండి. అనుకోని కర్చులు. వ్యయప్రయసలతో కూడిన రోజు. ఆఫీస్‌లో పై అధికారుల నుండి చికాకులు. వ్యాపారంలో చిన్ని చిన్న ఇబ్బందులు. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇంటాచ బయటా మీకు శారీరక శ్రమ పెరుగుతుంది. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : చాలా కాలం తర్వాత మీకు విశ్రాంతి, మనఃశాంతి లభిస్తుంది. ఈరోజు మీరు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రులతో సరదాగ గడుపుతారు. స్వల్ప ధన లాభం.అనుకోని ప్రయాణాలు. మహిలలకు ధనలాభాలు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : ఈరోజు మీరు సాధారణంగా గడుపుతారు. ఆనుకోని వ్యయప్రయాసలతో కూడిన రోజు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి. సాయంత్రం నుంచి మీకు కొద్దిగా అనుకూలత పెరుగుతుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మధ్య వర్తిత్వం వహించకండి. వ్యాపారాలలో లాభాలు. శ్రీ లక్ష్మీ, వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : ప్రతికూలమైన రోజు. మీరు ఈరోజు అనవసరంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఆదాయంలో తగ్గుదల, వ్యాపారాలలో నష్టాలకు అవకాశం ఉంది. పనులలో జాప్యం పెరుగుతుంది. ముఖ్యమైన పనులలో వాయిదా. ప్రభుత్వ పరంగా రావాల్సిన బకాయిలు వాయిదా పడుతాయి. అన్ని రంగాల వారికి కొద్దిగా శ్రమతో కూడిన రోజు. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : ప్రతికూలత, అనుకూలత కలబోసిన రోజు. అనుకోని ప్రయాణాలు,. ఆదాయంలో పెద్దగా మార్పులు ఉండవు. కుటుంబ సమస్యలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు. కీలక నిర్ణయాలలో జాప్యం పెరుగుతుంది. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు పెద్దగా ఫలించవు. మహిలలకు చక్కటి రోజు. శ్రీ ఆది వరాహస్వామి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : కొద్దిగా మిశ్రమంగా ఉండే రోజు. పనులలో జాప్యం పెరిగినా చివరకు పూర్తిచేస్తారు. వ్యాపారాలలో లావాదేవీలు సాఫీగా సాగుతాయి. ప్రశాంతత లోపిస్తుంది. ప్రోత్సాహం తగ్గిన పనులు మాత్రం పూర్తిచేస్తారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మహిలలకు ధనలాబాలు. విద్యా, ఉపాధి అవకాశాలు సాధారణంగా ఉంటాయి. శ్రీ లక్ష్మీనారసింహ స్వామి ఆరాదన చేయండి..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.