Pot : ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఇప్పుడు అందరూ కూల్ వాటర్ తాగడానికే ఇష్టపడుతారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్ లు అయిపోయాయి. ఫ్రిడ్జ్ లో వాటర్ పెట్టేసుకుని తాగేస్తున్నారు. ఇప్పుడంటే ఫ్రిడ్జ్ లు తయారయ్యాయి గానీ.. ఒకప్పుడు మాత్రం అందరూ మట్టికుండలోని నీళ్లే తాగేవారు. ఒక పదేండ్ల క్రితం అందరి ఇళ్లలో కూడా మట్టికుండలే ఎక్కువగా కనిపించేవి. అందులోనూ మధ్యతరగతి ఇళ్లలో ఎక్కువగా మట్టికుండలే ప్రత్యక్షం అయ్యేవి. అప్పట్లో మట్టికుండలోని నీటిని తాగిన వారే ఎంతో ధృడంగా ఉండేవారని చెప్పుకోవాలి.అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ మట్టికుండలోని నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. సామాన్యులకు చల్లని పాత్రలా మట్టికుండ ఉపయోగపడేది.
ఈ మట్టి కుండలను ఒక రకంగా చల్లటి ఆరోగ్య కుండ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులోని నీటిని తాగితే అన్ని ప్రయోజనాలు ఉంటాయి మరి. ఒంట్లో వేడిని కూల్ చేసేందుకు మట్టికుండల్లో నీరు తాగుతుంటారు. ఇలా మట్టి కుండల్లో నీరును తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కాకపోతే ఈ ప్రయోజనాలు జనాలకు తెలియవు. అందుకే వారు ఇప్పుడు ఫ్రిడ్జ్ లోని నీళ్లను తాగుతున్నారు. మట్టికుండలోని నీళ్లు తాగితే అతిగా దాహం వేయదు. దాంతో పాటు ఎసిడిటీ సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇది మన కడుపులో ఏదైనా చెడు బ్యాక్టీరియా ఉంటే దాన్ని అరికట్టడంలో సాయం చేస్తుంది. మట్టి కుండలోని నీళ్లు మెటబాలిజం రేటును కూడా బాగానే పెంచుతాయని అంటున్నారు.
అటు జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గడం.. గొంతుకు సంబంధించిన సమస్యలు దరికి చేరకపోవడం కూడా జరుగుతుంది. అంతే కాకుండా మన గొంతు సమస్యలు కూడా తగ్గిస్తుంది.జలుబు, దగ్గు సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. ఈ మట్టి కుండల్లోని నీరు టెస్టోస్టెరాన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. కాబట్టి అందరూ కుండలోని నీళ్లను తాగేందుకు ఇష్టపడండి. ఈ ఎండాకాలం ఫ్రిడ్జ్ నీళ్లను కాకుండా మట్టి కుండ నీళ్లనే తాగండి.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.