Pot : మట్టికుండలో నీళ్లు తాగితే ఇన్ని ప్రయోజనాలా.. తెలిస్తే అస్సలు వదలరు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pot : మట్టికుండలో నీళ్లు తాగితే ఇన్ని ప్రయోజనాలా.. తెలిస్తే అస్సలు వదలరు..!

Pot : ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఇప్పుడు అందరూ కూల్ వాటర్ తాగడానికే ఇష్టపడుతారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్ లు అయిపోయాయి. ఫ్రిడ్జ్ లో వాటర్ పెట్టేసుకుని తాగేస్తున్నారు. ఇప్పుడంటే ఫ్రిడ్జ్ లు తయారయ్యాయి గానీ.. ఒకప్పుడు మాత్రం అందరూ మట్టికుండలోని నీళ్లే తాగేవారు. ఒక పదేండ్ల క్రితం అందరి ఇళ్లలో కూడా మట్టికుండలే ఎక్కువగా కనిపించేవి. అందులోనూ మధ్యతరగతి ఇళ్లలో ఎక్కువగా మట్టికుండలే ప్రత్యక్షం అయ్యేవి. అప్పట్లో మట్టికుండలోని నీటిని తాగిన […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 April 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Pot : మట్టికుండలో నీళ్లు తాగితే ఇన్ని ప్రయోజనాలా.. తెలిస్తే అస్సలు వదలరు..!

Pot : ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఇప్పుడు అందరూ కూల్ వాటర్ తాగడానికే ఇష్టపడుతారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్ లు అయిపోయాయి. ఫ్రిడ్జ్ లో వాటర్ పెట్టేసుకుని తాగేస్తున్నారు. ఇప్పుడంటే ఫ్రిడ్జ్ లు తయారయ్యాయి గానీ.. ఒకప్పుడు మాత్రం అందరూ మట్టికుండలోని నీళ్లే తాగేవారు. ఒక పదేండ్ల క్రితం అందరి ఇళ్లలో కూడా మట్టికుండలే ఎక్కువగా కనిపించేవి. అందులోనూ మధ్యతరగతి ఇళ్లలో ఎక్కువగా మట్టికుండలే ప్రత్యక్షం అయ్యేవి. అప్పట్లో మట్టికుండలోని నీటిని తాగిన వారే ఎంతో ధృడంగా ఉండేవారని చెప్పుకోవాలి.అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ మట్టికుండలోని నీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. సామాన్యులకు చల్లని పాత్రలా మట్టికుండ ఉపయోగపడేది.

Pot : ఒంట్లో వేడిని తగ్గిస్తుంది..

ఈ మట్టి కుండలను ఒక రకంగా చల్లటి ఆరోగ్య కుండ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులోని నీటిని తాగితే అన్ని ప్రయోజనాలు ఉంటాయి మరి. ఒంట్లో వేడిని కూల్ చేసేందుకు మట్టికుండల్లో నీరు తాగుతుంటారు. ఇలా మట్టి కుండల్లో నీరును తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కాకపోతే ఈ ప్రయోజనాలు జనాలకు తెలియవు. అందుకే వారు ఇప్పుడు ఫ్రిడ్జ్ లోని నీళ్లను తాగుతున్నారు. మట్టికుండలోని నీళ్లు తాగితే అతిగా దాహం వేయదు. దాంతో పాటు ఎసిడిటీ సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇది మన కడుపులో ఏదైనా చెడు బ్యాక్టీరియా ఉంటే దాన్ని అరికట్టడంలో సాయం చేస్తుంది. మట్టి కుండలోని నీళ్లు మెటబాలిజం రేటును కూడా బాగానే పెంచుతాయని అంటున్నారు.

Pot మట్టికుండలో నీళ్లు తాగితే ఇన్ని ప్రయోజనాలా తెలిస్తే అస్సలు వదలరు

Pot : మట్టికుండలో నీళ్లు తాగితే ఇన్ని ప్రయోజనాలా.. తెలిస్తే అస్సలు వదలరు..!

అటు జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గడం.. గొంతుకు సంబంధించిన సమస్యలు దరికి చేరకపోవడం కూడా జరుగుతుంది. అంతే కాకుండా మన గొంతు సమస్యలు కూడా తగ్గిస్తుంది.జలుబు, దగ్గు సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. ఈ మట్టి కుండల్లోని నీరు టెస్టోస్టెరాన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. కాబట్టి అందరూ కుండలోని నీళ్లను తాగేందుకు ఇష్టపడండి. ఈ ఎండాకాలం ఫ్రిడ్జ్ నీళ్లను కాకుండా మట్టి కుండ నీళ్లనే తాగండి.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది