Chiya Seed : చియా గింజలను అధికంగా తింటున్నారా… అయితే అనర్ధాలు తప్పవు…!
ప్రధానాంశాలు:
Chiya Seed : చియా గింజలను అధికంగా తింటున్నారా... అయితే అనర్ధాలు తప్పవు...!
Chiya Seed : ప్రస్తుతం మనం ఉన్న ఈ కాలంలో చెడు ఆహారపు అలవాట్లు వలన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఈ సంవత్సరంలో ఒకటి అధిక బరువు కూడా. అయితే బరువు తగ్గేందుకు చియా గింజలు చేసే మేలు అంత ఇంత కాదు. పోషకాహార ని పునులు కూడా ఈ గింజలను నీటిలో నానబెట్టుకుని తాగాలి అని సిఫారీ చేస్తున్నారు. కానీ చియా సీడ్స్ తిన్న తర్వాత శరీరంలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి అంట. ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా అని అతిగా తీసుకుంటే కూడా అనర్ధాలు అనేవి తప్పవు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చియా గింజలలో ఫైబర్, ప్రోటీన్ ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకుంటే బరువు తగ్గటమే కాక కొలెస్ట్రాల్, రక్తపోటును కూడా అదుపులో ఉంచగలదు.అంతేకాక మలబద్దక సమస్యను కూడా తగ్గిస్తుంది. అయితే ఈ చియా విత్తనాలు అందరికీ కూడా అంతా మంచివి కాదు.
చియా గింజలను అధికంగా తీసుకోవటం వలన జీర్ణక్రియకు కూడా ఎంతో ఇబ్బంది కలుగుతుంది. చియా గింజలలో ఉండే అధిక ఫైబర్ పోట్ట సమస్యలను కూడా పెంచుతున్నది. ఆ జీర్ణం,గ్యాస్, అపానవాయువు సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కావున మీకు ఏదైనా అలర్జీ సమస్య ఉన్నట్లయితే ఈ విత్తనాలను తినకపోవడం చాలా మంచిది. కొన్నిసార్లు అతిసారం, వాంతులు, దురద లాంటి ప్రతి చర్యలకు కూడా ఎంతో కారణం అవుతుంది. అందుకే ఈ సమస్యలు ఉన్నవారు విత్తనాలను తీసుకోకపోవటమే చాలా మంచిది. చియ విత్తనాలలో ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ అని పిలవబడే కొవ్వు ఆమ్లం అనేది ఉంటుంది. ఇది మొత్తం ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రభావితం చేస్తుంది. అంతేకాక ఇవి ప్రోస్టేజ్ క్యాన్సర్ ప్రమాదాలను కూడా పెంచుతాయి. కావున ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.
చియా గింజలలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ లు రక్తాన్ని పల్చగా మార్చడంలో కూడా ఎంతో సహాయం చేస్తాయి. దీనితో శరీరంలో ఏ భాగంలో నైనా గాయం అయినట్లయితే రక్తస్రావం అనేది ఆగదు. అందువలన విత్తనాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. తక్కువ రక్తపోటు ఉన్నవారు కూడా ఈ విత్తనాలకు దూరంగా ఉండాలని వైద్యులు తెలిపారు. ఇవి ఎప్పుడైనా బీపీ ని తగ్గించగలవు. చియా విత్తనాలు బరువు తగ్గటానికి గ్రేట్ గా పని చేస్తాయి. కానీ చియా సీడ్స్ సరైన రీతి లో తీసుకోకపోతే బరువు తగ్గేందుకు బదులుగా బరువు పెరగటం స్టార్ట్ అవుతుంది. 2 టీ స్పూన్ల గింజలలో దాదాపు 138 క్యాలరీలు ఉంటాయి. నిపుణులు అభిప్రాయాల ప్రకారం చూస్తే,చియా విత్తనాలను రోజుకు ఒకటి నుండి ఒకటిన్నర స్పూన్లు మాత్రమే తీసుకోవాలి. నీటిలో నానబెట్టి లేక పాలు, పెరుగులో చియా గింజలను కలుపుకొని తీసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది కదా అని ఎక్కువగా తీసుకున్నట్లయితే మీ ప్రమాణా లు ప్రమాదంలో పడినట్లే. అందుకే ఈ విషయం లోచాలా జాగ్రత్తగా ఉండాలి.