Ear pain : చెవి నొప్పేగా అని తేలిగ్గా తీసుకుంటున్నారా… ఇది ప్రమాదకరమైన వ్యాధి సంకేతం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ear pain : చెవి నొప్పేగా అని తేలిగ్గా తీసుకుంటున్నారా… ఇది ప్రమాదకరమైన వ్యాధి సంకేతం…!

 Authored By ramu | The Telugu News | Updated on :28 March 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Ear pain : చెవి నొప్పేగా అని తేలిగ్గా తీసుకుంటున్నారా... ఇది ప్రమాదకరమైన వ్యాధి సంకేతం...!

Ear pain : ప్రస్తుతం మారుతున్న జీవనశైలి విధానంలో చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారు వరకు నిత్యం ఏదో ఒక సమస్య వేదిస్తూనే ఉంటుంది. అలాంటి సమస్యలు ఒకటి చెవి నొప్పి. చెవి నొప్పి కదా అని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. ఈ చెవి నొప్పి లేదా ఇన్ఫెక్షన్ అనేక రకాలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యను తగ్గించడానికి దగ్గుకి, జలుబుకి దూరంగా ఉండటం మంచిది. చెవి నొప్పి కంటికి కనిపించకుండా మనిషిని వేధిస్తూ ఉంటుంది. మీరు తరచుగా చెవి నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే మెడికల్ షాప్ లో లభించే ఏదో ఒక డ్రాప్ వేసి ఉపశమనం పొందుతున్నారా.?

ఇలా చేయడం ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచుగా వచ్చే చెవులో నొప్పిని తేలికగా తీసుకోకూడదని చెప్తున్నారు. ఎందుకంటే ఇది చాలా త్రీవ్రమైన వ్యాధులకి కారణం అవుతుందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. చెవి నొప్పిని తేలికగా తీసుకుంటే అది భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఈ చెవి నొప్పి ఎలాంటి ప్రమాదకర వ్యాధిని కి దారితీస్తుంది ఇప్పుడు మనం చూద్దాం… కొన్నిసార్లు గొంతు నొప్పి కారణంగా చెవిలో కూడా నొప్పి వస్తుంది. చాలామందికి చెవులో చీమతో పాటు రక్తం కూడా వస్తుంది.

అలాంటి పరిస్థితులలో వెంటనే డాక్టర్ని సంప్రదించి చికిత్స పొందాలి. చెవి నొప్పి నుంచి బయటపడడం కోసం ప్రజలు తరచుగా ఆయుర్వేద సహాయం తీసుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఈ నొప్పి తగ్గుతుంది. కానీ కొన్ని సందర్భాలలో తీవ్రమైన వ్యాధి లక్షణం అవచ్చు.. చెవి నొప్పి ఒక రోజు లేదా రెండు రోజులు కంటే ఎక్కువ ఉంటే దానిని నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు.. మీరు వెంటనే ఆరోగ్య నిపుణుని సంప్రదించాలి. మీకు చెవి నొప్పి సమస్య ఉంటే నీరు, షాంపు చెవులోకి వెళ్ళకుండా చూసుకోవాలి. దీని వలన కూడా చెవి నొప్పి మరింత ఎక్కువవుతుంది. కావున స్నానం చేసేటప్పుడు చెవుల్లో జాగ్రత్తగా కాటన్ పెట్టుకోవాలి.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది