Pumpkin Seeds : గుమ్మడి గింజలు అనేవి చూడటానికి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కానీ వీటిని ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఊహించని లాభాలు అందుతాయి. అలాగే గుండె సమస్యల నుండి తప్పించుకోడానికి కూడా గుమ్మడి గింజలలో ఉండే మెగ్నీషియం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ గింజలు ప్రతిరోజు తింటే స్ట్రోక్ మరియు గుండె సమస్యలతో వచ్చే మరణాల ప్రమాదాలను చాలా వరకు తగ్గుతాయి. అలాగే గుమ్మడి గింజలలో పీచు మరియు పిండి పదార్థాలు బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ ని చాలా వరకు మెరుగు పరుస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి అనేది తగ్గుతుంది. దీనికోసం ప్రతిరోజు గుమ్మడి గింజలను తీసుకోవటం మంచిది అని గుర్తుంచుకోవాలి. అంతేకాక నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడే వారికి గుమ్మడి గింజలు దివ్య ఔషధం. ఎందుకు అంటే ఈ గింజలలో ట్రిప్ట్ ఫాన్ మరియు అమైనో యాసిడ్స్ మంచి నిద్రకు హెల్ప్ చేస్తాయి. వీటితో పాటుగా వీటిల్లో కాపర్ మరియు జింక్, సెలీనియం నిద్ర యొక్క నాణ్యతను పెంచుతుంది. వీటిని తీసుకోవడం వలన హాయిగా నిద్ర అనేది పడుతుంది.
గుమ్మడి గింజలలో మెగ్నీషియం అనేది సమృద్ధిగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వలన బాడీలో కొలెస్ట్రాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. దీంతో పాటుగా హైబీపీ సమస్య కూడా తగ్గిపోతుంది. ఈ రెండు సమస్యలు ఉన్న వారికి గుమ్మడి గింజలు హెల్దీ స్నాక్స్ అని చెప్పొచ్చు. అలాగే వీటిని తీసుకోవడం వలన ఇమ్యూనిటీ కూడా ఎంతగానో పెరుగుతుంది. దీంతో సీజనల్ గా వచ్చే వ్యాధుల నుండి ఉపసవనం పొందవచ్చు. అలాగే బరువును తగ్గించడంలో కూడా ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది అని అందరికీ తెలుసు. దీనికోసం కూరగాయలు మరియు ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే వాటిని తినలేని వారు మాత్రం ఈ గింజలు తీసుకుంటే చాలు.
ఈ గుమ్మడి గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కావున కడుపు నిండుగా ఉండి బరువు తగ్గుతారు. అలాగే గుమ్మడి గింజలలో ఫాస్పరస్ మరియు జింక్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకలను ఎంతో బలంగా చేస్తాయి. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవడానికి గుమ్మడి గింజలు తీసుకుంటే మంచిది
EPS New System : ఉద్యోగుల పెన్షన్ స్కీం తో పాటు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. 2025…
Rice Water : ప్రస్తుత కాలంలో చాలా మంది తమ జుట్టు ఆరోగ్యం కోసం సహజ పద్ధతులను మరియు ఇంటి చిట్కాలపై…
TG Govt Skills University Jobs : ప్రపంచస్థాయి నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా…
Tulasi Vivaham : హిందూమతంలో తులసి శ్రీ మహావిష్ణువు రూపమైన శాలి గ్రాముల వివాహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక…
Work From Home Jobs : ఇంట్లో ఇద్దరు జాబ్ చేస్తేనే కానీ ఇల్లు గడవని పరిస్థితి ఉంది. ఎంత…
Telangana : తెలంగాణలో నిరుద్యోగ యువత పెరిగింది. నిరుద్యోగంలో దేశంలో రాష్ట్రం ముందుంది. రాష్ట్రంలోని 15 నుండి 29 సంవత్సరాల…
Nagula Chavithi : కార్తీక మాసంలో శుద్ధ శుక్ల పక్ష చవితి రోజున నాగుల చవితిని జరుపుకుంటారు. ఈ ఏడాది…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో సెంట్రాఫ్ అట్రాక్షన్గా…
This website uses cookies.