Pumpkin Seeds : గుమ్మడి గింజలను ప్రతిరోజు తీసుకుంటే చాలు… ఎంత భయంకరమైన వ్యాధులైన పరార్…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pumpkin Seeds : గుమ్మడి గింజలను ప్రతిరోజు తీసుకుంటే చాలు… ఎంత భయంకరమైన వ్యాధులైన పరార్…!!

 Authored By ramu | The Telugu News | Updated on :5 November 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Pumpkin Seeds : గుమ్మడి గింజలను ప్రతిరోజు తీసుకుంటే చాలు... ఎంత భయంకరమైన వ్యాధులైన పరార్...!!

Pumpkin Seeds : గుమ్మడి గింజలు అనేవి చూడటానికి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కానీ వీటిని ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఊహించని లాభాలు అందుతాయి. అలాగే గుండె సమస్యల నుండి తప్పించుకోడానికి కూడా గుమ్మడి గింజలలో ఉండే మెగ్నీషియం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ గింజలు ప్రతిరోజు తింటే స్ట్రోక్ మరియు గుండె సమస్యలతో వచ్చే మరణాల ప్రమాదాలను చాలా వరకు తగ్గుతాయి. అలాగే గుమ్మడి గింజలలో పీచు మరియు పిండి పదార్థాలు బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ ని చాలా వరకు మెరుగు పరుస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి అనేది తగ్గుతుంది. దీనికోసం ప్రతిరోజు గుమ్మడి గింజలను తీసుకోవటం మంచిది అని గుర్తుంచుకోవాలి. అంతేకాక నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడే వారికి గుమ్మడి గింజలు దివ్య ఔషధం. ఎందుకు అంటే ఈ గింజలలో ట్రిప్ట్ ఫాన్ మరియు అమైనో యాసిడ్స్ మంచి నిద్రకు హెల్ప్ చేస్తాయి. వీటితో పాటుగా వీటిల్లో కాపర్ మరియు జింక్, సెలీనియం నిద్ర యొక్క నాణ్యతను పెంచుతుంది. వీటిని తీసుకోవడం వలన హాయిగా నిద్ర అనేది పడుతుంది.

గుమ్మడి గింజలలో మెగ్నీషియం అనేది సమృద్ధిగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వలన బాడీలో కొలెస్ట్రాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. దీంతో పాటుగా హైబీపీ సమస్య కూడా తగ్గిపోతుంది. ఈ రెండు సమస్యలు ఉన్న వారికి గుమ్మడి గింజలు హెల్దీ స్నాక్స్ అని చెప్పొచ్చు. అలాగే వీటిని తీసుకోవడం వలన ఇమ్యూనిటీ కూడా ఎంతగానో పెరుగుతుంది. దీంతో సీజనల్ గా వచ్చే వ్యాధుల నుండి ఉపసవనం పొందవచ్చు. అలాగే బరువును తగ్గించడంలో కూడా ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది అని అందరికీ తెలుసు. దీనికోసం కూరగాయలు మరియు ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే వాటిని తినలేని వారు మాత్రం ఈ గింజలు తీసుకుంటే చాలు.

Pumpkin Seeds గుమ్మడి గింజలను ప్రతిరోజు తీసుకుంటే చాలు ఎంత భయంకరమైన వ్యాధులైన పరార్

Pumpkin Seeds : గుమ్మడి గింజలను ప్రతిరోజు తీసుకుంటే చాలు… ఎంత భయంకరమైన వ్యాధులైన పరార్…!!

ఈ గుమ్మడి గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కావున కడుపు నిండుగా ఉండి బరువు తగ్గుతారు. అలాగే గుమ్మడి గింజలలో ఫాస్పరస్ మరియు జింక్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకలను ఎంతో బలంగా చేస్తాయి. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవడానికి గుమ్మడి గింజలు తీసుకుంటే మంచిది

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది