Gangavalli : ఈ ఆకుకూరను తినడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసా...!!
Gangavalli : కూరలు అనేవి మన ఆరోగ్యానికి చాలా మంచివి అనే సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఒక రకంగా చెప్పాలి అంటే నాన్ వెజ్ కంటే కూడా ఆకుకూరలు తింటే చాలా మంచిది. దీనిలో శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎన్నో దాగి ఉన్నాయి. అయితే నాన్ వెజ్ తింటే కొలెస్ట్రాల్ అనేది బాగా పెరిగిపోతుంది. కానీ ఈ ఆకుకూరలను తింటే మాత్రం చెడు కొలెస్ట్రాల్ ను ఈజీగా తగ్గించుకోవచ్చు. అయితే ఈ ఆకుకూరలలో గంగవల్లి కూడా ఒకటి. అయితే దీనిని పలు ప్రాంతాలలో పలు రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ ఆకు కూర అనేది కొద్దిగా పుల్లగా ఉంటుంది. అయితే ఈ ఆకు అనేది పల్లెటూళ్లలో పొలాలలో గట్ల పక్కన ఎక్కువగా ఉంటుంది. ఈ ఆకు కూర అనేది నేల మీదనే ఎక్కువగా పాకుతుంది. అలాగే ఆకుకూరకు పసుపు రంగులో పూలు కూడా పూస్తూ ఉంటాయి. ఇది చాలా ఈజీగా దొరుకుతుంది. అలాగే ఈ ఆకుల్లో చాలా రకాల పోషకాలు కూడా ఉన్నాయి. అయితే ఈ గంగవల్లి కూరను తినడం వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ఈ ఆకుకూరలలో విటమిన్ ఏ బి సి లు మరియు కాల్షియం, ఐరన్,పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం లాంటి ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. అలాగే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మరియు కేలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి.
బరువు తగ్గాలి అని అనుకునేవారు ఈ ఆకు కూర తింటే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకు అంటే దీనిలో పోషకాలు అనేవి ఎక్కువగాను మరియు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి. అంతేకాక శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. కావున బరువు తగ్గేందుకు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు…
గుండెకు మేలు : ఈ ఆకుకూరను తింటే గుండె ఎంతో బాగా పని చేస్తుంది. అలాగే రక్త ప్రసరణ కూడా సరిగ్గా జరుగుతుంది. అంతేకాక రక్తంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుండెకు మేలు చేస్తుంది. దీంతో ఇతర గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి…
జీర్ణ సమస్యలు మాయం : ఈ గంగవల్లి కూరను తింటే జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే అజీర్తి మరియు గ్యాస్,మలబద్ధకం లాంటి సమస్యలు కూడా రావు. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధికంగా ఉంటాయి…
Gangavalli : ఈ ఆకుకూరను తినడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసా…!!
రక్తహీనత తగ్గుతుంది : రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ కూరను తింటే మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఐరన్ అధికంగా ఉంటుంది. కావున రక్తహీనత సమస్య నుండి మీరు ఈజీగా బయటపడొచ్చు. అలాగే చర్మంపై వచ్చే ముడతలు మరియు మచ్చలు, మొటిమలు అనేవి తగ్గి మీరు యవ్వనంగా ఉంటారు…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
This website uses cookies.