Gangavalli : ఈ ఆకుకూరను తినడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gangavalli : ఈ ఆకుకూరను తినడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసా…!!

 Authored By ramu | The Telugu News | Updated on :12 October 2024,8:00 am

Gangavalli : కూరలు అనేవి మన ఆరోగ్యానికి చాలా మంచివి అనే సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఒక రకంగా చెప్పాలి అంటే నాన్ వెజ్ కంటే కూడా ఆకుకూరలు తింటే చాలా మంచిది. దీనిలో శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎన్నో దాగి ఉన్నాయి. అయితే నాన్ వెజ్ తింటే కొలెస్ట్రాల్ అనేది బాగా పెరిగిపోతుంది. కానీ ఈ ఆకుకూరలను తింటే మాత్రం చెడు కొలెస్ట్రాల్ ను ఈజీగా తగ్గించుకోవచ్చు. అయితే ఈ ఆకుకూరలలో గంగవల్లి కూడా ఒకటి. అయితే దీనిని పలు ప్రాంతాలలో పలు రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ ఆకు కూర అనేది కొద్దిగా పుల్లగా ఉంటుంది. అయితే ఈ ఆకు అనేది పల్లెటూళ్లలో పొలాలలో గట్ల పక్కన ఎక్కువగా ఉంటుంది. ఈ ఆకు కూర అనేది నేల మీదనే ఎక్కువగా పాకుతుంది. అలాగే ఆకుకూరకు పసుపు రంగులో పూలు కూడా పూస్తూ ఉంటాయి. ఇది చాలా ఈజీగా దొరుకుతుంది. అలాగే ఈ ఆకుల్లో చాలా రకాల పోషకాలు కూడా ఉన్నాయి. అయితే ఈ గంగవల్లి కూరను తినడం వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Gangavalli గంగవల్లిలో పోషకాలు

ఈ ఆకుకూరలలో విటమిన్ ఏ బి సి లు మరియు కాల్షియం, ఐరన్,పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం లాంటి ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. అలాగే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మరియు కేలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి.

Gangavalli వెయిట్ లాస్

బరువు తగ్గాలి అని అనుకునేవారు ఈ ఆకు కూర తింటే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకు అంటే దీనిలో పోషకాలు అనేవి ఎక్కువగాను మరియు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి. అంతేకాక శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. కావున బరువు తగ్గేందుకు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు…

గుండెకు మేలు : ఈ ఆకుకూరను తింటే గుండె ఎంతో బాగా పని చేస్తుంది. అలాగే రక్త ప్రసరణ కూడా సరిగ్గా జరుగుతుంది. అంతేకాక రక్తంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుండెకు మేలు చేస్తుంది. దీంతో ఇతర గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి…

జీర్ణ సమస్యలు మాయం : ఈ గంగవల్లి కూరను తింటే జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే అజీర్తి మరియు గ్యాస్,మలబద్ధకం లాంటి సమస్యలు కూడా రావు. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధికంగా ఉంటాయి…

Gangavalli ఈ ఆకుకూరను తినడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసా

Gangavalli : ఈ ఆకుకూరను తినడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసా…!!

రక్తహీనత తగ్గుతుంది : రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ కూరను తింటే మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఐరన్ అధికంగా ఉంటుంది. కావున రక్తహీనత సమస్య నుండి మీరు ఈజీగా బయటపడొచ్చు. అలాగే చర్మంపై వచ్చే ముడతలు మరియు మచ్చలు, మొటిమలు అనేవి తగ్గి మీరు యవ్వనంగా ఉంటారు…

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది