Moringa Leaves : ఇవి కేవలం ఆకులే అనుకుంటే పొరపడినట్లే… 300 రకాల వ్యాధులకు అద్భుత సంజీవని…!
ప్రధానాంశాలు:
Moringa Leaves : ఇవి కేవలం ఆకులే అనుకుంటే పొరపడినట్లే... 300 రకాల వ్యాధులకు అద్భుత సంజీవని...!
Moringa Leaves : మనకు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన చెట్లలో మునగ చెట్టు కూడా ఒకటి. దీనికి ఆయుర్వేదంలో కూడా ప్రత్యేక స్థానం ఉంది. అలాగే ఈ మునగాకులో ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తుంది. దీనిని నిత్యం ఖచ్చితంగా తీసుకోవడం వలన బోలెడు లాభాలు ఉన్నాయి. అలాగే ఆయుర్వేదంలో మునగాకును పోషకాల పవర్ హౌస్ గా చెబుతారు. అలాగే మునగాకులో విటమిన్ సి అనేది సమృద్ధిగా ఉంటుంది. అలాగే దీనిలో ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్లు, కాల్షియం,మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఏ బి సి కాంప్లెక్స్, అమైనో యాసిడ్స్, బీటా కెరోటిన్, ఫినోలిక్ లతో పాటుగా 40 కంటే అధిక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి…
అలాగే ఈ మునగాకుతో కూర చేసి బాలింతలకు పెడితే పాలు అనేవి బాగా పెరుగుతాయి అని అంటారు. ఈ మునగాకు అనేది విటమిన్ సి కలిగి ఉండడం వలన రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అలాగే ఈ మునగాకు ఊబకాయం మరియు బరువును తగ్గించడంలో కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. అయితే మీరు పెరుగు తినడం వలన కలిగే ప్రోటీన్స్ కన్నా మీకు ఈ మునగాకు నుండి ఎనిమిది రెట్లు ఎక్కువ పోషకాలు లభిస్తాయి. అంతేకాక పాల నుండి దొరికే కాల్షియం కన్నా ఈ మునగాకు నుండి 17 రెట్లు ఎక్కువగా మీకు లభిస్తుంది.
అలాగే ఈ మునగాకులో ఉన్న ఔషధ గుణాల వలన జుట్టు రాలడం మరియు ఉబ్బసం, కీళ్ల నొప్పులు లాంటి సాధారణ వ్యాధులకు చికిత్స చేయడంలో కూడా ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. అయితే మీరు అరటి పండు నుండి పొందే పొటాషియం కన్నా ఈ ఎండిన మునగాకు నుండి 17 రెట్లు ఎక్కువగా మీకు లభిస్తుంది…