Cancer : మీలో ఈ ఐదు లక్షణాలు కనిపిస్తే… నిర్లక్ష్యం చేయకండి… క్యాన్సర్ కు సంకేతం కావచ్చు…!
ప్రధానాంశాలు:
Cancer : మీలో ఈ ఐదు లక్షణాలు కనిపిస్తే... నిర్లక్ష్యం చేయకండి... క్యాన్సర్ కు సంకేతం కావచ్చు...!
Cancer : ప్రస్తుతం భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి రోజు రోజుకి ఎంతగానో పెరిగిపోతుంది. ప్రస్తుత అధ్యయనాల ప్రకారం చూస్తే, క్యాన్సర్ ప్రభావం 50 ఏళ్ల లోపు వారిలోనే ఈ ప్రమాదం అనేది అధికంగా ఉందంట. అయితే ఈ క్యాన్సర్ రేటు పెరిగేందుకు వాయు కాలుష్యం కారణం అయితే,ప్రస్తుత మన జీవనశైలి కూడా ఒక కారణం అని అంటున్నారు. అనగ మితిమీరిన జంక్ ఫుడ్, ఆల్కహాల్, నిద్రలేమి, స్మోకింగ్,అధిక బత్తుడి వలన కూడా క్యాన్సర్ అనేది వస్తుంది. దీని వలన ఎక్కువగా క్యాన్సర్ కణాలు అనేవి శరీరంలో గూడు కట్టుకుంటాయి. దీనిని మొదట్లోనే గుర్తించకపోవడం వలన ఆలస్యం అవ్వడంతో మరింత ప్రమాదానికి గురిచేస్తుంది. అయితే సరైన టైంలో దీనికి చికిత్స మొదలు పెట్టటానికి క్యాన్సర్ కు సంబంధించిన కణాలను గుర్తించడం ఎంతో ముఖ్యం.
క్యాన్సర్ కణాలు అనేవి మీ శరీరంలో గూడు కట్టుకునేటప్పుడు ఈ ఐదు లక్షలలో ఏదో ఒక లక్షణం మీకు కనిపిస్తుంది. అయితే ఈ లక్షణాలు కనిపించినట్లయితే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యులను సంప్రదించండి. అయితే ఎంతో మంది రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ హిమోగ్లోబిన్ స్థాయి అనేది చాలా తక్కువ మాతాదులో గనుక ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించండి. అయితే ఇది క్యాన్సర్ కు కూడా సంకేతం కావచ్చు అంటున్నారు. అలాగే మీరు దగ్గేటప్పుడు రక్తస్రావం మరియు ముత్రంలో రక్తం, రొమ్ము వాపు, గొంతు నొప్పి, ఆహారం మింగినప్పుడు ఇబ్బంది, రుతువిరతి తర్వాత కూడా రక్తస్రావం కావడం లాంటి లక్షణాలు కూడా క్యాన్సర్ కు సంకేతాలే. మీలో ఈ లక్షణాలు గనుక కనిపించినట్లయితే వెంటనే వైద్యుల్ని సంప్రదించి చెక్ చేయించుకోండి.
ఈ లక్షణాలలో ఏ లక్షణమైనా మీకు కనిపించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి చెక్ చేయించుకుంటే మంచిది. అప్పుడే క్యాన్సర్ ను ప్రారంభంలోనే గుర్తించగలం. దీనిని ప్రారంభంలోనే గుర్తించడం వలన దానిని తగ్గించటం సాధ్యమవుతుంది. అయితే నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే, ఈ ప్రపంచంలోనే 200 రకాల క్యాన్సర్లు ఉన్నాయట. అయితే ఈ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించడం వలన చికిత్స మొదలుపెట్టి ఈ వ్యాధిని వీలైనంత తొందరలో నయం చేయవచ్చు అని అంటున్నారు