Raw Papaya : పండిన బొప్పాయి కన్నా పచ్చి బొప్పాయిని తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పచ్చి బొప్పాయి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ ఏ బి సి, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, మాంగనీస్ పోషకాలు అధికంగా ఉన్నాయి. దీనిలో ఉన్న ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ వలన రక్త ప్రసరణ బాగా జరిగే అవకాశం ఉన్నది. ఈ పచ్చి బొప్పాయిని గనక తీసుకున్నట్లయితే జీర్ణ ప్రక్రియను ప్రోత్సహించటంతో పాటుగా కీళ్ల సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ పచ్చి బొప్పాయి లో చర్మనికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. అయితే పండిన బొప్పాయి కూడా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ బొప్పాయి బరువును నియంత్రించటంలో కూడా సహాయపడుతుంది. ఈ బొప్పాయి లో ఉన్న ఫైబర్ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగిస్తుంది. దీనిలో ఉన్న విటమిన్స్ రోగనిరోధక శక్తిని బలంగా చేస్తుంది…
ఈ బొప్పాయి అంటు వ్యాధులు మరియు అనారోగ్యంతో పోరాడేందుకు కూడా పనిచేస్తుంది. అయితే బరువురు నియంత్రించాలి అనుకునే వారికి ఈ పచ్చి బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. ఈ పచ్చి బొప్పాయి పేగులలో మరియు కడుపు ఇబ్బందికర పరిస్థితిని నియంత్రించడానికి కూడా దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. ఈ పచ్చి బొప్పాయి తీసుకోవటం వలన చర్మంపై ఉన్నటువంటి సోరియాసిస్, మొటిమలు స్కిన్ ప్రెగ్నెంటేషన్ లాంటి సమస్యలు తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది. ఈ పచ్చి బొప్పాయి రసాన్ని తీసుకోవటం వలన ఎర్రబడిన ట్రాన్సిల్స్ కు చికిత్సగా కూడా పనిచేస్తుంది. ఈ పచ్చి బొప్పాయి లో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ వలన అస్తమ, ఆర్థరైటిస్ ఉన్నటువంటి రోగులకు ఎంతో సహాయపడుతుంది. పచ్చి బొప్పాయి మరియు వాటి ఆకులలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి…
ఈ పచ్చి బొప్పాయిలో చక్కెర స్థాయిలు అనేవి తక్కువగా ఉండడం వలన పచ్చి బొప్పాయి ముక్కలు తీసుకుంటే మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. ఈ పచ్చి బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, కాలేయ పనితీరును కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది. ఈ బొప్పాయి ఆకులలో ఉండే పోషకాలు వలన నేలసరి వలన వచ్చే సమస్యలు మరియు బాలింతలలో పాల ఉత్పత్తి కూడా ఎంతగానో పెరుగుతుంది. అలాగే ఒత్తిడి మరియు ఆందోళన కూడా తగ్గుతుంది. అంతేకాక జీర్ణ క్రియ కూడా ఎంతగానో మెరుగుపడుతుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా చూస్తుంది. ఈ బొప్పాయి ఆకు రసాన్ని డెంగ్యూ వచ్చిన వారికి తాపిస్తే ప్లేట్లెట్ల సంఖ్య అనేది పెరుగుతుంది. ఈ పచ్చి బొప్పాయి లో ఉన్న విటమిన్ సి, ఇ చర్మా న్ని కూడా కాపాడుతుంది. అలాగే వృద్ధాప్యాన్ని కూడా నియంత్రిస్తుంది. అలాగే రక్తపోటును నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. పచ్చి బొప్పాయి శరీరం నుండి వ్యర్ధాలను కూడా బయటకు పంపిస్తుంది. అలాగే ఎముకలను కూడా ఎంతో దృఢంగా చేస్తుంది. అంతేకాక కామెర్ల వ్యాధులను నియంత్రించడంలో కూడా మేలు చేస్తుంది…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.