Home » Health » Curd Vs Buttermilk Which Is Better For Wight Loss
Health

Wight Loss : బరువును నియంత్రించడంలో పెరుగు లేక మజ్జిగ ఏది బెస్ట్…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 23, 2024, 7:00 am
Advertisement

Wight Loss : ప్రస్తుత కాలంలో అధిక బరువుతో చాలా మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ బరువును తగ్గించుకునేందుకు మనం తీసుకునే ఆహారంలో తక్కువ కేలరీలు ఉండే ఆహారాలను తీసుకోవాలని డైటీషన్లు ఎప్పుడు మనకు చెబుతూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వేసవిలో ప్రజలు పెరుగు లేక మజ్జిగ ఎంతో ప్రయోజనం అని భావిస్తూ ఉంటారు. అయితే ఇవి మీ బరువును నియంత్రించడంలో సహాయపడటమే కాక మిమ్మల్ని వేసవికాలంలో హైడ్రేట్ గా కూడా ఉచ్చుతుంది. మెరుగైన జర్ణక్రియ కోసం వేసవి కాలంలో మన ఆహారంలో మజ్జిగ లేక పెరుగుని చేర్చుకోవడం చాలా అవసరం. ఇవి రెండు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Advertisement

అయినప్పటికీ కూడా పెరుగు లేక మజ్జిగ ఈ రెండిట్లో దేనిని తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. తరచుగా ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్న అనేది తలెత్తుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే. వేసవి కాలంలో పెరుగును చాలా మంది ప్రతి రోజు తీసుకోవడానికి ఇష్టపడతారు. మరికొందరైతే మజ్జిగ తాగటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఈ రెండింటి విషయంలో ప్రజలకు ఎప్పుడు కూడా గందరగోళంగా ఉంటుంది. పెరుగు లేక మజ్జిగ ఏది మంచిది, అనే విషయంలో మీకు కూడా సందేహం ఉన్నట్లయితే దీని గురించి కచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే. మీరు బరువును నియంత్రించాలి అని అనుకున్నట్లయితే పెరుగు తినాలా లేక మజ్జిగ తాగాలా ఈ రెండిటిలో ఏది బరువు తగ్గటానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Wight Loss బరువు తగ్గటానికి ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది

1. తక్కువ కెలరీలు తీసుకునే విషయంలో మాత్రం మజ్జిగ బెటర్.
2. పెరుగుతో పోల్చినట్టయితే మజ్జిగలో కెలరీల పరిమాణం అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది.
3. మీరు గనక బరువు తగ్గాలి అనుకున్నట్లయితే మీకు మజ్జిగ మంచి ఎంపిక.
4. బరువు పెరగాలి అనుకునే వారికి మాత్రం పెరుగు బెస్ట్.

Advertisement

ఎక్కువ కాలం హైడ్రేడ్ గా ఉంచుతుంది : పెరుగు కన్నా మజ్జిగలో మాత్రం ఎక్కువ నీరు అనేది ఉంటుంది. దీని కారణంగా బరువు తగ్గే టైంలో ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు హైడెడ్ గా ఉంచడంలో బాగా హెల్ప్ చేస్తుంది. దీనితో పాటుగా వేసవి కాలంలో ఎక్కువకాలం హైడ్రేషన్ మెయింటెన్ చేసేందుకు పెరుగు కాకుండా మజ్జిగ తీసుకుంటే చాలా మంచిది..

పుష్కలంగా పోషకాలు : మనం పోషకాల గురించి మాట్లాడుకున్నట్లయితే, మజ్జిగలో కాల్షియం, విటమిన్లు, కనిజాలు లాంటి పోషకాలు అధికం గా ఉన్నాయి. కానీ పెరుగు కంటే కూడా మజ్జిగలో మాత్రం కొవ్వు అనేది చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. బరువు తగ్గే విషయంలో మాత్రం మజ్జిగ ఎంతో ప్రయోజనంగా చెప్పటానికి ఇది ముఖ్య కారణం. ఎందుకు అంటే. ఈ మజ్జిగలో కొవ్వు పరిమాణం అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి. ఇతర అవసరమైనటువంటి పోషకాల పరిమాణం కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది.

Advertisement

Wight Loss : బరువును నియంత్రించడంలో పెరుగు లేక మజ్జిగ ఏది బెస్ట్…!

లాక్టోస్ సహనం ఉన్నవారికి : లాక్టోస్ సహనం ఉన్నవారికి పెరుగు అనేది జీర్ణం కావటానికి ఎంతో కష్టం అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో మీరు పెరుగుకు బదులుగా మజ్జిగను తీసుకుంటే చాలా మంచిది ఎందుకు అంటే ఇది చాలా తక్కువ లాక్టోబర్ పరిమాణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది మెరుగైన జీర్ణక్రియతో పాటు మొత్తం ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా మేలు చేస్తుంది అంతేకాక బరువు తగ్గేందుకు కూడా ఇది ఎంతో బాగా పనిచేస్తుంది..

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి