
Maruti Suzuki Cars : సరికొత్త ఫీచర్స్‌తో న్యూ జెన్ మారుతి కార్లు.. వివిధ రకాలు ఆప్షన్స్‌తో త్వరలోనే లాంచ్
Maruti Suzuki Cars : మారుతి కార్ ఇష్ట పడని వారు లేరు. సరికొత్త ఫీచర్స్,మంచి మైలేజ్‌తో ఆ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త రకం కార్లని మార్కెట్‌లోకి విడుదల చేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. డిజైన్ పరంగా పలు మార్పులు చేస్తూ నయా కార్లని మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. కొద్ది నెలల్లో మూడు కొత్త కార్లను భారత విపణిలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అవి: మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ, న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్, మారుతి సుజుకి ఈవీఎక్స్ ఎస్యూవీ. కాగా వాటి ఫీచర్స్ చూస్తే..
న్యూ-జెన్ మారుతి సుజుకి స్విఫ్ట్ కారు సీఎన్‌జీ ఇప్పుడు సీఎన్‌జీ వర్షెన్‌లో అందుబాటులోకి రానుంది. ద్వితియార్ధంలో కారుని మనదేశంలో లాంచ్ చేయబోతున్నట్టు సమాచారం. సీఎన్‌జీ కారు 32 కి.మీ/కిలో మైలేజ్ ఇస్తుందని సమాచారం. ఇక పెట్రోల్ వెర్షన్ కంటే ఈ సీఎన్‌జీ ఇంజిన్‌తో వస్తున్న కారు ధర రూ.90,000-రూ.95,000 ఎక్కువగా ఉండనున్నట్టు సమాచారం. అయితే సీఎన్‌జీ వలన పవర్ ఔట్పుట్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
2. New Gen Maruti Suzuki Dzire : ఈ న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్ కారును వచ్చే ఏడాది జూలైలో విడుదల చేయనున్నట్టు ఓ టాక్ వినిపిస్తుంది. డిజైర్ మోడల్ కార్స్ ఓ రేంజ్‌లో సేల్ అవుతుంటాయి. ఇప్పుడు సరికొత్త మోడల్స్ కూడా మంచి సేల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సన్‌రూఫ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే, సన్‌రూఫ్ ఫెసిలిటీ పొందిన తొలి సెడాన్ కారుగా న్యూ-జెన్ మారుతి సుజుకి డిజైర్ నిలవడం ఖాయం. కారులో 1.2లీటర్ Z సిరీస్‌కు చెందిన మూడు సిలిండర్ల Z12E పెట్రోల్ ఇంజిన్ అమర్చే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ 111.7 Nm పీక్ టార్క్ ప్రొడ్యూస్ చేయనుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఫీచర్లను జతపరుస్తారు. ఇక కొలతలు అన్నీ కూడా పాత మోడల్ తరహాలో ఉండబోతుంది. ఆటోమేటిక్ HVAC, కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఈ కారులో ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్, అప్‌గ్రేడ్ చేసిన హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్స్, కొత్త సెట్ బంపర్లు ఈ కారు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు
Maruti Suzuki Cars : సరికొత్త ఫీచర్స్‌తో న్యూ జెన్ మారుతి కార్లు.. వివిధ రకాలు ఆప్షన్స్‌తో త్వరలోనే లాంచ్
3. Maruti Suzuki eVX Electric SUV : మారుతి సుజుకి eVX ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఈ ఏడాది చివరి నాటికి భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ చేస్తున్న ఈ కారును, బోర్న్-ఎలక్ట్రిక్ స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్నారు. 2700mm వీల్‌బేస్‌తో 4.3 మీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో ఒక ఛార్జ్‌పై 400 కిలో మీటర్ల రేంజ్‌తో 48 kWh బ్యాటరీ ఒకటి ఉండగా, 550 కిలో మీటర్ల రేంజ్ ఇచే 60 kWh బ్యాటరీ మరొకటి ఉంటుంది. పలు కంపెనీల కార్లకి పోటీగా ఈ కారుని విడుదల చేస్తున్నారు. ఇవి ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 28 జనవరి 2026, బుధవారం ఏ రాశి…
India EU Free Trade Agreement 2026 | దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్, యూరోపియన్…
Union Budget 2026 ": దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారు రైతులు. “జై జవాన్.. జై కిసాన్” అనే…
Redmi Note 15 Pro 5G : భారత India స్మార్ట్‌ఫోన్ Smart Phone మార్కెట్లో మరో హాట్ అప్డేట్కు…
pakistan : టీ20 వరల్డ్ కప్ india vs pakistan t20 world cup 2026 ప్రారంభానికి ఇంకా రెండు…
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…
Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…
This website uses cookies.