Skin Care : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా అందంగా కనిపించాలనే ఉద్దేశంతో రకరకాల ఫేస్ క్రీములు వాడుతూ ఉంటారు. అలాగే ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి సీజన్ తో ఎలాంటి పని లేదు. ఏ కాలం అయినా సరే అందంగా కనిపించడమే కొంత మంది లక్ష్యం. అందుకే వారు రోజులో పదే పదే ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన ముఖంపై బ్యాక్టీరియా మరియు క్రిములు నశించి ముఖం ఎంతో అందంగా తయారు అవుతుంది అని భావిస్తూ ఉంటారు. కానీ రోజులో నాలుగు లేక ఐదు సార్లు ఫేస్ వాష్ చేయడం వలన ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి అని వైద్యులు చెబుతున్నారు. మీకు ఎంతో అవసరం అయినప్పుడు తప్పితే ముఖాన్ని రెండు లేక మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేయకూడదు అని అంటున్నారు. ఇలా చేయడం వలన చర్మానికి సంబంధించిన సమస్యలు తప్పవు అని హెచ్చరిస్తున్నారు. మీరు మూడు గంటలకు ఒక సారి ఫేస్ వాష్ చేయటం వలన చర్మంపై ఉండే తేమ అనేది తగ్గుతుంది. దీని వలన ముఖం అనేది పొడి మారటం మొదలవుతుంది. దీని ఫలితంగా ముఖంపై తెల్లటి మచ్చలు,చర్మం అనేది పగిలినట్లుగా అనిపించడం లాంటిది జరుగుతూ ఉంటాయి…
ముఖం కడుక్కునేటప్పుడు మార్కెట్లో దొరికే ఇతర రకాల చర్మ సౌందర్య సాధనాలను వాడటం అంతా మంచిది కాదు అని అంటున్నారు. ఒక్కొక్కరి చర్మ తత్వం ఒక్కోలా ఉంటుంది కాబట్టి. కొందరికి జిడ్డు చర్మం ఉంటే, మరికొందరికి మాత్రం పొడిబారినట్టు ఉంటుంది. ఇంకొందరు మాత్రం సాధారణ చర్మ తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే చర్మ తత్వాన్ని బట్టి రోజుకు ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి అనేది ఆధారపడి ఉంటుంది అని వైద్య నిపుణులు తెలిపారు. ఈ తరుణంలో సాధారణ చర్మ తత్వం కలవారు రోజుకు ఒకటి లేఖ రెండుసార్లు ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే జిడ్డు చర్మం కలిగిన వారు రెండు మూడు సార్లు ఫేస్ వాష్ చేసిన తర్వాత టోర్నర్ ని వాడితే ఎక్కువ టైం మీ ముఖం అనేది తాజాగా కనిపించే అవకాశం ఉంటుంది.ఇకపోతే పొడి చర్మం ఉన్న వారు ఒకటి లేఖ రెండు సార్లు ఫేస్ వాష్ చేసుకొని వెంటనే మాయిశ్చరైజేషన్ రాసుకోవాలి. అప్పుడే మంచి ఫలితం అనేది మీకు దక్కుతుంది.
చర్మం అనేది తేమను కోల్పోకుండా ఉండాలి అంటే. స్నానం చేసే ముందు బాదం నూనెను ముఖనికి మరియు శరీరానికి బాగా అప్లై చేసుకోవాలి. అలా గంటసేపు ఉంచినట్లయితే చర్మ పోషణకు అవసరమైనటువంటి పోషకాలు అన్నీ కూడా చర్మానికి అందుతాయి. దీని ఫలితంగా చర్మం అనేది మృదువుగా మరియు మెరుస్తూ కనిపిస్తుంది. దీంతో చర్మం అనేది తొందరగా పొడిబారకుండా కూడా చూస్తుంది. మీకు ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి అనిపిస్తే నీటితో ఫేస్ వాష్ చేసుకునే బదులు తడిగా ఉండే వైప్స్ ని వాడండి. దీనిలో కూడా ఇతర రకాల ప్లేవర్స్ తో మార్కెట్లో మీకు అందుబాటులో ఉన్నాయి…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.