
Diabetes : డయాబెటిస్ పేషెంట్లకు అన్నం ఇలా వండితే... ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...!
Diabetes : మనదేశంలో అన్నం అనేది ప్రధాన ఆహారం అని చెప్పొచ్చు. దీనిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణ క్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక శరీరాన్ని ఎంతో దృఢంగా మరియు శక్తివంతంగా ఉండేలా కూడా చూస్తుంది. ఈ వైట్ రైస్ లో గ్లూటెన్ అనేది ఉండదు. అలాగే మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి,ఐరన్ లాంటి ఎన్నో పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ వైట్ రైస్ లో సోడియం లెవెల్స్ అతి తక్కువ మోతాదులో ఉంటాయి. కావున హై బీపీ సమస్య ఉన్నటువంటి వారు ఈ అన్నని మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అయితే ఈ అన్నాన్ని వండేందుకు కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. అయితే ఆయుర్వేద నిపుణులు చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే,ఈ వైట్ రైస్ ను వండుకొని తినడం వలన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. అయితే అన్నాన్ని వండుకునే ముందు బియ్యాన్ని కొద్దిగా వేయించుకోవాలి అని దాని తర్వాత మరిన్ని నీళ్లు పోసి శుభ్రం గా కడగాలి అని అంటున్నారు. ఇలా చేసినట్లయితే ఎన్నో అద్భుత ఫలితాలు పొందవచ్చు అని అంటున్నారు. అలాగే శరీరానికి కూడా ఎంతో మంచి ఫలితాలు అందుతాయి అని అంటున్నారు…
మనకు కావలసినంత బియ్యాన్ని తీసుకొని ఒక పాన్ లో పోసుకొని చిన్న మంటపై వేయించాలి. ఇలా వేయించడం వలన దీనిలో ఉండే పిండి పదార్థాలు తగ్గుతాయి అని అంటున్నారు. అంతేకాక అన్నం అనేది జిగటగా ఉండకుండా పొడిపొడిగా ఉంటుంది అని అంటున్నారు. అయితే డయాబెటిస్ పేషెంట్ లు ఇలా వండిన ఆహారాన్ని తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇకపోతే అన్నం వండే ముందు బియ్యాన్ని శుభ్రమైన నీటితో రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టాలి. ఆ బియ్యం సుమారుగా అరగంట సేపు నానిన తర్వాత అన్నన్ని వండుకోవాలి. ఇలా చేయడంతో బియ్యం మీద అంటుకున్న మట్టి మరియు ఇతర కణాలు తొలగిపోయి అన్నం అనేది ఎంతో పొడిగా ఉంటుంది.
Diabetes : డయాబెటిస్ పేషెంట్లకు అన్నం ఇలా వండితే… ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…!
సాధారణంగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నట్లయితే దానికి రెండు నుండి రెండున్నర గ్లాసుల నీరు సరిపోతుంది. కాకుంటే మీరు వాడుకునే బియ్యం రకం ఆధారంగా ఈ నిష్పత్తి అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఇకపై అన్నం వండే తరుణంలో రుచికోసం కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే వండుతున్న అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకోవడం వలన అన్నం రుచి అనేది పెరుగుతుంది. పైగా అన్నం కూడా పొడిగా ఉంటుంది. అయితే మీరు కేవలం అన్నం తినటం ఆరోగ్యకరం అంటే సరికాదు. అయితే ఎంతో సమతుల్య ఆహారంలో భాగంగా అన్నంతో పాటుగా కూరగాయలు, పండ్లు, ప్రోటీన్లు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. మీరు బరువును నియంత్రించాలి అనుకుంటే కేవలం అన్నం తినడం మాత్రమే కాక ఎంతో ఆరోగ్యకరమైన ఆహారంతో పాటుగా సరైన వ్యాయామం కూడా ఎంతో ముఖ్యం. అలాగే వాకింగ్ మరియు యోగా లాంటిది అలవాటు చేసుకుంటే చాలా మంచిది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.