Curd : రాత్రిపూట పెరుగు తినడం మంచిదా? .. తింటే ఏమైన స‌మ‌స్య‌లు వ‌స్తాయా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Curd : రాత్రిపూట పెరుగు తినడం మంచిదా? .. తింటే ఏమైన స‌మ‌స్య‌లు వ‌స్తాయా?

 Authored By ramu | The Telugu News | Updated on :6 August 2025,11:00 am

Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అందరికీ ఇష్టమైన పెరుగు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది.పెరుగు ప్రోటీన్, కాల్షియం, ప్రోబయోటిక్స్‌తో శరీరానికి ఎన్నో లాభాలు కలిగించే ఆహార పదార్థం. అయితే రాత్రిపూట పెరుగు తినడం మాత్రం ఆరోగ్యానికి మేలు చేయదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Curd రాత్రిపూట పెరుగు తినడం మంచిదా తింటే ఏమైన స‌మ‌స్య‌లు వ‌స్తాయా

Curd : రాత్రిపూట పెరుగు తినడం మంచిదా? .. తింటే ఏమైన స‌మ‌స్య‌లు వ‌స్తాయా?

Curd : ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్పనిస‌రి..

ఆధునిక వైద్యం మరియు ఆయుర్వేదం రెండూ సూచించేది ఏంటంటే రాత్రి సమయంలో పెరుగు తింటే జీవక్రియ మందగిస్తుంది. ఈ సమయంలో పెరుగు లాంటి కొవ్వు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది.పెరుగు శరీరంలో కఫంపెంచే ఆహారంగా గుర్తించబడింది. జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు అధికమయ్యే అవకాశముంది.

ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలు, జలుబు ఉన్నవారు రాత్రిపూట పెరుగు పూర్తిగా నివారించాలి. ఉదయం లేదా మధ్యాహ్న భోజన సమయంలో పెరుగు తీసుకుంటే మంచిది. ఇంట్లో తయారుచేసిన తాజా పెరుగు వాడటం ఆరోగ్యానికి ఉత్తమం. పాల ఉత్పత్తులకు అలెర్జీ ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా పెరుగు తీసుకోవద్దు. అధిక కొలెస్ట్రాల్, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ సమయం, శరీర స్థితిని బట్టి తీసుకోవడం ఎంతో ముఖ్యం. రాత్రిపూట తినాలంటే డాక్టర్ లేదా ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది