Store Meat in Fridge : చికెన్, మటన్‌ను ఫ్రిజ్‌లో ఎంతకాలం స్టోర్ చేయొచ్చో .. స్టోర్ చేసిన మాంసం తినోచ్చా ..!

 Authored By suma | The Telugu News | Updated on :6 February 2026,7:00 am

ప్రధానాంశాలు:

  •  Store Meat in Fridge : చికెన్, మటన్‌ను ఫ్రిజ్‌లో ఎంతకాలం స్టోర్ చేయొచ్చో .. స్టోర్ చేసిన మాంసం తినోచ్చా ..!

Store Meat in Fridge : చాలామందికి ముక్క లేకపోతే భోజనం దిగదు. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో రోజూ మార్కెట్‌కు వెళ్లే టైమ్ లేక, వీకెండ్స్‌లోనే వారం రోజుల మాంసాహారాన్ని ఒకేసారి కొనుగోలు చేసి ఫ్రిజ్‌లో భద్రపరచడం అలవాటుగా మారింది. ఇది సౌకర్యంగా అనిపించినా దీని వెనుక దాగి ఉన్న ఆరోగ్య ముప్పుల గురించి చాలా మందికి అవగాహన లేదు. ఫ్రిజ్‌లో ఉంచిన మాంసం నిజంగా శక్తిని ఇస్తుందా? లేక నెమ్మదిగా శరీరాన్ని దెబ్బతీసే సైలెంట్ పాయిజన్‌గా మారుతుందా? నిపుణుల హెచ్చరికలను తెలుసుకుందాం.

Do you know how long you can store chicken and mutton in the fridge?

Store Meat in Fridge : చికెన్, మటన్‌ను ఫ్రిజ్‌లో ఎంతకాలం స్టోర్ చేయొచ్చో .. స్టోర్ చేసిన మాంసం తినోచ్చా ..!

Store Meat in Fridge : బిజీ లైఫ్ – పెరుగుతున్న అనారోగ్య ప్రమాదం

ఉద్యోగస్తులు, విద్యార్థులు ఎక్కువగా వీకెండ్స్‌లో మాంసం కొనుగోలు చేసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. అయితే పోషకాహార నిపుణుల ప్రకారం పచ్చి మాంసాన్ని ఫ్రిజ్‌లో ఉంచిన 48 గంటల తర్వాత దాని సహజ పోషక విలువలు తగ్గడం మొదలవుతుంది. ప్రోటీన్లు, విటమిన్లు క్రమంగా క్షీణిస్తాయి. అంతేకాదు సరైన ఉష్ణోగ్రత లేకపోతే లేదా తేమ ఎక్కువగా ఉంటే బ్యాక్టీరియా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. సాల్మొనెల్లా, ఈ-కోలి వంటి హానికర సూక్ష్మజీవులు ఆహార విషబాధకు కారణమవుతాయి. కాబట్టి కొనుగోలు చేసిన రెండు రోజుల్లోపు మాంసాన్ని వండుకోవడం ఆరోగ్యానికి అత్యంత సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు.

Store Meat in Fridge : సరైన నిల్వ పద్ధతి ఏది?

. నిల్వ చేయక తప్పని పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
. మాంసాన్ని తెచ్చిన వెంటనే శుభ్రంగా కడిగి అదనపు తేమ లేకుండా ఆరబెట్టాలి. తేమ ఉండటం బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదం చేస్తుంది.
. గాలి చొరబడని డబ్బాలు లేదా జిప్‌లాక్ బ్యాగుల్లో మాంసాన్ని ప్యాక్ చేయాలి.
. సాధారణ ఫ్రిజ్ సెక్షన్ కంటే డీప్ ఫ్రీజర్‌లో ఉంచితే బ్యాక్టీరియా వృద్ధి నెమ్మదిస్తుంది.
. ఒకసారి ఫ్రీజర్‌లో ఉంచిన మాంసాన్ని బయటకు తీసి కరిగిన తర్వాత మళ్లీ ఫ్రీజర్‌లో పెట్టకూడదు. ఇలా చేస్తే బ్యాక్టీరియా రెట్టింపు వేగంతో పెరిగి ఆరోగ్యానికి తీవ్రమైన హానిని కలిగిస్తుంది.
. అలాగే చిన్న చిన్న ముక్కలుగా విభజించి నిల్వ చేస్తే అవసరమైనంత మాత్రమే తీసుకుని వండుకోవచ్చు.

Store Meat in Fridge : చెడిపోయిందని గుర్తించడం ఎలా?

ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మాంసం చెడిపోయిందో లేదో గుర్తించడం చాలా ముఖ్యం. మాంసం నుంచి అసహ్యమైన దుర్వాసన వస్తే వెంటనే పారేయాలి. రంగు సహజంగా కాకుండా బూడిద రంగు లేదా ఆకుపచ్చ ఛాయకు మారితే అది ప్రమాద సంకేతం. చేతితో తాకినప్పుడు అతుక్కుపోయేలా జిగటగా అనిపిస్తే తినకూడదు. వండిన తర్వాత కూడా అసాధారణమైన రుచి లేదా వాసన ఉంటే ఆహారం తీసుకోకపోవడం ఉత్తమం. సౌకర్యం కోసం చేసే చిన్న నిర్లక్ష్యం పెద్ద ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి ఫ్రిజ్‌లో మాంసాన్ని నిల్వ చేసే ముందు తరువాత ఈ జాగ్రత్తలు పాటిస్తేనే ఆరోగ్యంగా ఉండగలమని నిపుణులు సూచిస్తున్నారు.

 

suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి