Home » Health » Do You Know There Are 8 Types Of Salt Which One Is The Best
Health

Salt : ఉప్పులో 8 రకాలు ఉన్నాయి తెలుసా… వీటిలో ఏది బెస్ట్…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: July 19, 2024, 10:00 am
Advertisement

Salt  : ఉప్పు లేకుండా వంట చేయటం అనేది దాదాపు అసాధ్యం అనే చెప్పాలి.సాధారణంగా తెల్ల ఉప్పును వంటలలో ఎక్కువగా వాడతారు. దీనిని టేబుల్ సాల్ట్ అని పిలుస్తారు. ఇవి మాత్రమే కాక ఇంకా కొన్ని రకాల ఉప్పులు మార్కెట్లో దొరుకుతున్నాయి. అయితే అవి పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, సముద్రపు ఉప్పు ఇలా ఎన్నో రకాల ఉప్పులు ఉన్నాయి. సాధారణంగా పింక్ సాల్ట్ మరియు బ్లాక్ సాల్ట్ లను సలాడ్లు మరియు స్నాక్స్ లాంటి వాటిలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి అసిడిటీని నియంత్రించడానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వైట్, పింక్, బ్లాక్ ఉప్పులు మాత్రమే కాదు మొత్తం ఎనిమిది రకాల ఉప్పులు మార్కెట్లో ఉన్నాయి. ఉదాహరణకు వైట్ సాల్ట్,పింక్ సాల్ట్,బ్లాక్ సాల్ట్, టేబుల్ సాల్ట్, అల్లాయ్ సాల్ట్, కొషర్ సాల్ట్, స్మోక్ డ్ సాల్ట్,పార్సీ సాల్ట్ ఇలా ఎన్నో రకాల ఉప్పులు ఉన్నాయి. అయితే వీటిలో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనే విషయంలో చాలా మందికి ప్రశ్నార్థకంగా ఉన్నది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Advertisement

Salt టేబుల్ సాల్ట్

టేబుల్ సాల్ట్ అనేది ఎంతో ఈజీగా దొరికే మరియు సాధారణంగా వాడే ఉప్పు. దీనిలో ఎలాంటి మలినాలు అనేవి ఉండవు. దీనిలో ఆహారం కూడా ఎంతో బాగుంటుంది. దీనిని ఎన్నో ప్రక్రియల తర్వాత తయారు చేయడం జరుగుతుంది. అందుకే ఈ ఉప్పు అనేది చాలా పొడిగా మరియు వదులుగా కూడా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో దొరికే టేబుల్ సాల్ట్ లో అధిక భాగం అయోడిన్ తో కలిపి ఉంటుంది. ఇది థైరాయిడ్ లాంటి సమస్యల నుండి మిమ్మల్ని రక్షించడంలో ఎంతో సహాయం చేస్తుంది. అలాగే పిల్లల్లో ఎంతో మెరుగైన మెదడు అభివృద్ధి కి ఈ అయోడిన్ అనేది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ ఉప్పును అధికంగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరమే…

బ్లాక్ సాల్ట్ : ఇది హిమాలయన్ ఉప్పు. సాధారణంగా దీనిని బ్లాక్ సాల్ట్ అని అంటారు. ఈ ఉప్పును తయారు చేసేటప్పుడు దీనిలో ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు మరియు విత్తనాలు, మొక్కల బెరడును వాడతారు. ఈ బ్లాక్ సాల్ట్ ను ఎక్కువ కాలం పాటు నిప్పులో ఉడికించి తయారు చేస్తారు. అందుకే ఇది నలుపు రంగులో కనిపిస్తుంది. అయితే ఈ ఉప్పు కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం, అసిడిటీ ఇతర సమస్యలకు దివ్య ఔషధంగా పని చేస్తుంది.

Advertisement

Salt : ఉప్పులో 8 రకాలు ఉన్నాయి తెలుసా… వీటిలో ఏది బెస్ట్…!

పింక్ సాల్ట్ : పింక్ సాల్ట్ అనగా రాక్ సాల్ట్ అని అర్థం.ఈ ఉప్పు గనులు అనేవి పాకిస్తాన్ లోని హిమాలయాల ఒడ్డున ఉంటాయి. ఈ ఉప్పు అనేది ఎంతో స్వచ్ఛమైనది మరియు ఉత్తమమైనదిగా చెబుతారు. ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దీనిలో దాదాపుగా 84 ముఖ్యమైన ఖనిజాలనేవి ఉంటాయి. ఈ ఉప్పును మీ ఆహారంలో చేర్చుకోవడం వలన ఎన్నో రకాల శారీరక సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ పింక్ సాల్ట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుతుంది. ఈ ఉప్పుతో ఉడికించిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది…

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి