Karthika Deepam Serial : త్వరలో పార్ట్ 2 స్టార్ట్ అవుతోంది “కార్తీకదీపం” నిరూపమ్ సంచలన వ్యాఖ్యలు..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 26 January 2023, 8:30 pm

Karthika Deepam Serial : రెండు తెలుగు రాష్ట్రాలలో “కార్తీకదీపం” సీరియల్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2017వ సంవత్సరంలో స్టార్ట్ అయిన ఈ సీరియల్ తెలుగు మహిళా లోకాన్ని ఎంతగానో అలరించింది. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 గంటలకు “మా” టీవీ లో ప్రసారమయ్యే ఈ సీరియల్ కీ టెలివిజన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేవాళ్ళు. దీంతో “కార్తీకదీపం” సీరియల్ లో నటీనటులకు మంచి గుర్తింపు లభించింది. ఇప్పటివరకు 1500కీ పైగా ఎపిసోడ్స్ పూర్తి చేసుకోవడం జరిగింది.

ఈ సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబు నిరూపం, ధీపగ ప్రేమీ విశ్వనాధ్, మోనితగ శోభా శెట్టి నటనకు ప్రతి మహిళ కనెక్ట్ కావడం జరిగింది. ప్రస్తుతం ఈ సీరియల్ ముగియటంతో రెండు తెలుగు రాష్ట్రాల మహిళలు ఎంతో నిరాశకు గురవుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఈ సీరియల్ సిబ్బంది ఈటీవీలో ఇంటర్వ్యూలో పాల్గొని… కార్తీకదీపం కు సీక్వెల్ ఉంటుందని కొత్త న్యూస్ తెలియజేశారు. కానీ కాస్త విరామం తీసుకున్నాక మొత్తం సెట్ అయ్యాక అధికారిక ప్రకటన ఉంటుందని ప్రచారం జరుగుతుంది. తెలుగు టెలివిజన్ రంగంలో “విధి” అనే సీరియల్ మినహా ఇప్పటివరకు మరో సీరియల్ కీ సీక్వెల్ జరగలేదు.

rajendra Revel Start soon Karthika Deepam Serial part 2

rajendra Revel Start soon Karthika Deepam Serial part 2

ఇలాంటి తరుణంలో “కార్తీకదీపం” మొదటి భాగం కథను డామినేట్ చేసేలా కొత్త స్క్రిప్ట్ తయారు చేస్తున్నామని.. సీరియల్ హీరోని రూపం స్పష్టం చేశారు. “కార్తీకదీపం”లో పెద్ద పాత్ర నుండి చిన్న పాత్రలు చేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు భవిష్యత్తు లభించింది. ఈ క్రమంలో తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. కచ్చితంగా “కార్తీకదీపం” కి సీక్వెల్ ఉంటుందని నిరూపమ్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp