Karthika Deepam Serial : కార్తీకదీపం సీరియల్ చూడనివ్వడం లేదని కోపంతో ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా .. ?

 Authored By prabhas | The Telugu News | Updated on :2 February 2023,9:00 am

Karthika Deepam Serial : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ సీరియల్ కార్తీకదీపం. తెలంగాణలో జరిగిన ఓ సంఘటనతో ఈ సీరియల్ కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కి ఫుల్ ఫాన్స్ ఉన్నారు. ఈ సీరియల్ లో నటించిన డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత, సౌందర్య చిన్నపిల్లల పాత్రలకు జనాలకు బాగా నచ్చేసాయి. అందుకే ఈ సీరియల్ సూపర్ హిట్ అయింది. ఈ సీరియల్ కేవలం ఆడవాళ్లు మాత్రమే కాదు ఇంట్లోనే మగ వాళ్లకు కూడా ఈ సీరియల్ అంటే ఇష్టం. ఎలా అంటే ఈ సంఘటన గురించి తెలిస్తే

Do you know what this man did when he was angry that Karthika Deepam Serial

Do you know what this man did when he was angry that Karthika Deepam Serial

ఈ సీరియల్ కు మగవాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నారా అని ఆశ్చర్యపోతారు. అయితే కార్తీకదీపం సీరియల్ ఇటీవల అయిపోయింది. అయితే ఈ సీరియల్ చూడనివ్వడం లేదని ఓ వ్యక్తి ఏం చేసాడో తెలిస్తే షాక్ అవుతారు. ఈ వింత ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. గత నెలలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామానికి చెందిన గట్టు మొగిలి కిరాణా కొట్టును నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన తాళ్లపల్లి వెంకటయ్య గత నెల 23న రాత్రి మద్యం తాగి అరువు కోసం మొగిలి కొట్టుకు వెళ్లాడు.

Do you know what this man did when he was angry that Karthika Deepam Serial

Do you know what this man did when he was angry that Karthika Deepam Serial

ఆ సమయంలో కార్తీక దీపం సీరియల్ చూడడంలో లీనమైపోయాడు మొగిలి. సీరియల్ అయిపోయాక అప్పు ఇస్తానని చెప్పిన వెంకటయ్య వినిపించుకోకుండా పదేపదే విసిగించసాగాడు. దీంతో కోపం వచ్చిన మొగిలి వెంకటయ్య పై దాడి చేసి అతని వేలు కొరికాడు. దీంతో వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. పోలీసులు మొగిలిని విచారించగా అతడు కార్తీకదీపం సీరియల్ చూడనివ్వకుండా విసిగించాడని అందుకే వేలు కొరికాను అని చెప్పాడు. దీంతో పోలీసులు షాక్ అయిపోయారు. పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. సీరియల్స్ ప్రభావం జనాలపై ఎంత ప్రభావం పడుతుందో ఈ ఘటనతో అర్థం అవుతుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి