Cancer : కారులో ఎక్కువగా జర్నీలు చేస్తున్నారా.. క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త..!
ప్రధానాంశాలు:
Cancer : కారులో ఎక్కువగా జర్నీలు చేస్తున్నారా.. క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త..!
Cancer : ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సౌకర్యవంతంగా జీవన విధానాన్ని మార్చుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో చూసుకుంటే జర్నీలు చేసేందుకు ఒకప్పుడు ఎక్కువగా బైక్ లు ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు మధ్యతరగతి వారు కూడా కార్లు వాడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కారులో మాత్రమే తిరిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు కొత్త కార్లు కొంటుంటే మరికొందరు మాత్రం సెకండ్ హ్యాండ్ కార్లు కొని తిరుగుతున్నారు. అయితే వర్షాకాలం, ఎండాకాలం, చలికాలంలో కారులో తిరిగేందుకు సౌకర్యంగా ఉంటుంది. కానీ కారులో ఎక్కువగా జర్నీలు చేసేవారికి ఓ షాకింగ్ న్యూస్ వచ్చింది.
ఎక్కువగా జర్నీలు చేసే వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తాజాగా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. కార్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణికులు ఎక్కువగా క్యాన్సర్ కెమికల్స్ పీలుస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది. ఇదే విషయం మీద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ విభాగానికి చెందిన నేషనల్ టాక్సాలజీ ప్రోగ్రామ్‌లో భాగంగా చేసిన అధ్యయనంలో ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ సర్వేలో భాగంగా 2015 నుంచి 2022 మధ్య కాలంలో వచ్చిన 101 ఎలక్ట్రిక్, గ్యాస్, హైబ్రిడ్ కార్లపై రీసెర్చ్ చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Cancer అవి పీలిస్తే
అయితే ఇప్పుడు వాడుతున్న దాదాపు అన్ని కార్లలో 99 శాతం కార్లు ప్రయాణం చేస్తున్న సమయంలో చాలా ప్రమాదకర రసాయనాలు విడుల చేస్తున్నట్టు తేలింది. ఇవి గనక ప్రజలు పీలిస్తే మాత్రం వారి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది. అగ్ని ప్రమాదాల్ని నివారించే టీసీఐపీపీ అనే కెమికల్స్, క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే TDCIPP, TCEP అనే రసాయనాలు కార్ల నుంచి విడుదల అవుతున్నాయి. అవి పీలిస్తే కచ్చితంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదమే ఎక్కువగా ఉంటుందంట. ఇక సమ్మర్ లో ఇవి మరింత ఎక్కువగా విడుదల చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. కాబట్టి కార్లలో ప్రయాణిస్తున్నప్పుడు కారు కిటీకీలను తెరిచి ఉంచాలని చెబుతున్నారు. గ్లాసెస్ ను దించుకుని ప్రయాణం చేయడం ఉత్తమం అని అంటున్నారు. దాంతో పాటు సీట్ కవర్లు సహజంగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.