Antibiotics : చిన్న అనారోగ్య సమస్య వచ్చినా… యాంటీబయటిక్ వాడుతున్నారా… ఏం జరుగుతుందో తెలుసా..?
ప్రధానాంశాలు:
Antibiotics : చిన్న అనారోగ్య సమస్య వచ్చినా... యాంటీబయటిక్ వాడుతున్నారా... ఏం జరుగుతుందో తెలుసా..?
Antibiotics : ప్రస్తుత కాలంలో ప్రజలు ఏ చిన్న అనారోగ్య సమస్యకు గురైన సరే ఇలాంటి బయటికి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. గ్రామీణ ప్రాంతాలలోనైన పట్టణ ప్రాంతాలలోనైన ఆంటీ బయాటిక్స్ దుర్వినియోగం అనేక అనారోగ్య సమస్యలను దారితీస్తుంది. ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కు గురిచేస్తుంది. సరైన ప్రీస్క్రీషషన్ లేకుండా యాంటీబయటిక్ కొనుగోలు చేసి వాటిని ఉపయోగిస్తే అలాంటి వారిలో యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ పెరుగుతుంది…
Antibiotics : చిన్న అనారోగ్య సమస్య వచ్చినా… యాంటీబయటిక్ వాడుతున్నారా… ఏం జరుగుతుందో తెలుసా..?
Antibiotics యాంటీబయోటిక్స్ ఎక్కువగా వినియోగిస్తే
గ్రామీణ ప్రాంతాలలో అవగాహన లేని ఆర్ఎంపీ డాక్టర్స్ చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు ఎక్కువ డోసేజ్ యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు. ఇది కూడా వారిలో యాంటీబయటిక్స్ రెసిస్టెన్స్ ను కు కారణం అవుతుంది. దీనివల్ల భవిష్యత్తులో యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తే పనిచేయని పరిస్థితికి ఉంటుంది. ప్రజలు ఆరోగ్యానికి పెరుగుతున్న అతిపెద్ద ఆందోళన.
యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్ వస్తే కష్టం : ఏంటి బయోటిక్ రెసిస్టెన్స్ అనేది బ్యాక్టీరియా మార్పులు చెందినప్పుడు మందుల ప్రభావాలకు ఇమ్యూన్ గా మారినప్పుడు జరుగుతుంది దీనివల్ల ఇతరత్రా వ్యాధులు సంక్రమించిన చికిత్స చేయడం కష్టమవుతుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు తక్కువగా ఉండటం వల్ల యాంటీబయాటిక్స్ తో సొంత వైద్యం చేసుకుంటారు ప్రజలు తరచుగా డాక్టర్ను సంప్రదించకుండా స్థానిక దుకాణాల నుండి ఈ మందులు కొనుగోలు చేసి వాడటం కారణంగా భవిష్యత్తులో అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అనుభవజ్ఞ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
యాంటీబయోటిక్స్ వల్ల మనకు తెలియకుండానే సైడ్ ఎఫెక్ట్స్ : యాంటీబయోటిక్సు దొరినియోగం వ్యక్తులకు మాత్రమే ప్రభావితం చేయదు ఇది ప్రజా ఆరోగ్యానికి విస్తృతమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది.మనకు తెలియకుండానే మన శరీరంలో వివిధ సైడ్ ఎఫెక్ట్స్ కు యాంటీబయటిక్సు కారణమవుతుంటాయి. కాబట్టి ఆంటీబయాటిక్స్ ఎక్కువగా ఉపయోగించడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు .
ఇలా చేయడం ఉత్తమం : యాంటీ బయటిక్స్ వినియోగం వల్ల వచ్చే సమస్యలు క్లిష్టంగా మారిన తర్వాత పరిష్కరించడం కష్టమవుతుంది. అందుకే యాంటీబయటిక్ వినియోగం పైన విక్రయం పైన కఠినమైన నియంత్రణలో అవసరం వైద్యులు రోగులకు యాంటీబయటిక్ తగిన విధంగా ఉపయోగించకపోవడం వల్ల కలిగే ప్రభావతాలు గురించి అవగాహన పెంచాలి.గ్రామీణ ప్రాంతాలలో నేరుగా యాంటీబయోటిక్స్ కొనుక్కునే విధానాన్ని నియంత్రించాలి. సాధ్యమైనంత వరకు ఆరోగ్య సమస్యలను న్యాచురల్ గా తగ్గించేందుకు ప్రయత్నించాలి.