Periods : పీరియడ్స్ టైం లో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. సమస్యలు ఎదుర్కోక తప్పదు...!
Periods : నెలసరి సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. ఎందుకు అంటే అమ్మాయిలకు, మహిళలకు పీరియడ్స్ ఎంతో కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. కొంతమందికి నెలసరి ఇబ్బందులు స్వల్పంగా ఉంటే. మరి కొంత మందికి తీవ్రంగా ఉంటాయి. కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్ళు లాగడం, అధిక రక్తస్రావం, నీరసం, చిరాకు, తిమ్మిర్లు, వాంతులు, కళ్ళు తిరగడం ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. పీరియడ్స్ టైం లో వ్యక్తిగత వర్క్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అయితే పీరియడ్స్ టైం లో ఆడవాళ్లు తెలిసి తెలియకుండా చేసేటటువంటి కొన్ని తప్పులు కారణంగా ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవుతాయని చాలామంది నిపుణులు చెప్తున్నారు. మరి నెలసరి సమయంలో పొరపాటున కూడా ఈ తప్పును చేయకుండా ఉండడానికి ఆ తప్పులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.. నిత్యజీవితంలో నెలసరి సమయంలో ఈ తప్పులకు దూరంగా ఉంటే మీ జీవితం కూడా ఎంతో ప్రశాంతంగా గడిచిపోతుంది. మరి ఇప్పుడు ఆ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం వల్ల ఐరన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దానివల్ల బాడీ పై నీరసం, అలసిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు పాలకూరలాంటి ఆకుకూరలు తీసుకోవడం వల్ల పెరగడానికి సహాయపడతాయి. పైగా ఆకుకూరల్లో ఐరన్ తో పాటుగా ఎన్నో పోషక విలువలు ఉండడం వల్ల కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కాఫీ తీసుకోవడం వల్ల తలనొప్పి విరోచనాలు లాంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కాఫీకి బదులుగా అల్లం టీ తాగండి. అల్లం లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దానివల్ల కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా వికారం వాంతులు లాంటివి కూడా రాకుండా ఉంటాయి. అయితే ఒక రోజుకు నాలుగు గ్రాములు అల్లం కంటే ఎక్కువగా తీసుకోవద్దు. సాధారణంగా పీరియడ్స్ సమయంలో చాక్లెట్లు తినమని అందరూ చెబుతూ ఉంటారు. అయితే పీరియడ్స్ సమయంలో డార్క్ చాక్లెట్ మాత్రమే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డార్క్ చాక్లెట్లలో అధిక శాతం ఐరన్ మెగ్నీషియం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో మాత్రమే డార్క్ చాక్లెట్ ఉపయోగపడుతుందంటే పొరపాటే.. పిఎస్ సమస్యకు సంబంధించిన లక్షణాలు కనిపించినా కూడా డార్కె చాక్లెట్ తో నివారించుకోవచ్చు. అన్ని రకాల ఆహార పదార్థాలతో పాటు తాజా ఫ్రూట్స్ ఇంకా నట్స్ కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారాన్ని వండుకోవడానికి సమయం లేకపోవడం వల్ల మార్కెట్లో దొరికేటటువంటి జంక్ ఫుడ్ తినడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఆహార పదార్థాలలో ఎక్కువగా ఉప్పు, కారాలను ఉపయోగిస్తారు. వాటి వల్ల కడుపునొప్పి వాంతులు లాంటి జీర్ణ ప్రక్రియకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలకు ఇంత దూరంగా ఉంటే అంత మంచిది అని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా డీహైడ్రేషన్ గురిచేస్తుంది. దాని వల్ల తలనొప్పి, కళ్ళు తిరగడం లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వీటితోపాటుగా జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. కాబట్టి వీలైనంతవరకు ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. ఇక పీరియడ్స్ టైం లో వర్క్ అవుట్ చేస్తూ ఉంటారు. చాలామంది అయితే ఈ టైం లో వర్క్ అవుట్ చేస్తే కనుక కష్టమైనది అస్సలు చేయకూడదని నిపుణులు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో హార్మోన్ పెరగడం ప్రారంభమవుతుంది. అదేవిధంగా భారీ వర్కౌంట్స్ కడుపుపై కూడా చాలా వరకు వత్తిడి ని కలిగిస్తుంది. పీరియడ్స్ సమయంలో స్నానం చేయడం మంచిదే.. కానీ యోగ ప్రకారం ఆయుర్వేద ప్రకారం పీరియడ్స్ టైం లో తలస్నానం చేయకూడదని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే తలపై నీళ్లు పోస్తే ప్రాణవాయువు అనేది కిందికి ప్రవహిస్తుంది. ఇది అసలు మంచిది కాదు. ఒకవేళ తలస్నానం చేయాలి అనుకుంటే గోరువెచ్చ ని నీటితో మాత్రమే చేయాలి. ఇక మరి కొంతమంది పీరియడ్స్ టైం లో రోజంతా కూడా నిద్రపోతూ ఉంటారు. కానీ రోజంతా నిద్రపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కాలంలో నొప్పి, తిమ్మిరి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కొద్దిగా వాకింగ్ చేయాలి. దీనివల్ల మానసిక స్థితిని మెరుగు చేసేటటువంటి హార్మోన్లను పెంచుతుంది. నొప్పిని కూడా తగ్గిస్తుంది. అలాగే మంచి ఆహారం తీసుకోవాలి.
Chukkakur : ఆకుకూరలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అటువంటి ఆకుకూరలో ఒకటైన ఆకు కూర చుక్కకూర. ఈ…
Zodiac Signs : గ్రహాలకు రాజు అయిన సూర్య భగవానుడు జనవరి 15వ తేదీన ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు. నెల…
One Nation One Election : పార్లమెంటులో కేంద్రం జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 129వ రాజ్యంగ సవరణ…
Priyanka Gandhi : పాలస్తీనా" అని రాసి ఉన్న తన బ్యాగ్‌పై బిజెపి నిరసన వ్యక్తం చేయడాన్ని కాంగ్రెస్ ఎంపి…
Blood Group : ప్రస్తుత కాలంలో పుట్టే పిల్లలకు హెల్త్ ప్రాబ్లమ్స్, అంగవైకల్యాలు, పుట్టుకతోనే వస్తున్నాయి. ఇవన్నీ భార్యాభర్తలు ఇద్దరిది…
Aadhaar : myAadhar పోర్టల్ ద్వారా మీ ఆధార్ కార్డ్‌ని ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి గడువు డిసెంబర్ 14, 2024…
Kannappa Movie : మంచు మోహన్ బాబు నటుడిగా, నిర్మాతగా సినీ పరిశ్రమలో సత్తా చాటారు. హీరోగానే కాకుండా సపోర్టింగ్…
Cold Wave : తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. వారం రోజుల నుంచి కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.…
This website uses cookies.