Periods : పీరియడ్స్ టైం లో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. సమస్యలు ఎదుర్కోక తప్పదు…!

Authored By Jyothi Marikanti | The Telugu News | Published on: January 3, 2024, 11:00 am
  •  Periods : పీరియడ్స్ టైం లో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. సమస్యలు ఎదుర్కోక తప్పదు...!

Periods  : నెలసరి సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. ఎందుకు అంటే అమ్మాయిలకు, మహిళలకు పీరియడ్స్ ఎంతో కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. కొంతమందికి నెలసరి ఇబ్బందులు స్వల్పంగా ఉంటే. మరి కొంత మందికి తీవ్రంగా ఉంటాయి. కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్ళు లాగడం, అధిక రక్తస్రావం, నీరసం, చిరాకు, తిమ్మిర్లు, వాంతులు, కళ్ళు తిరగడం ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. పీరియడ్స్ టైం లో వ్యక్తిగత వర్క్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అయితే పీరియడ్స్ టైం లో ఆడవాళ్లు తెలిసి తెలియకుండా చేసేటటువంటి కొన్ని తప్పులు కారణంగా ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవుతాయని చాలామంది నిపుణులు చెప్తున్నారు. మరి నెలసరి సమయంలో పొరపాటున కూడా ఈ తప్పును చేయకుండా ఉండడానికి ఆ తప్పులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.. నిత్యజీవితంలో నెలసరి సమయంలో ఈ తప్పులకు దూరంగా ఉంటే మీ జీవితం కూడా ఎంతో ప్రశాంతంగా గడిచిపోతుంది. మరి ఇప్పుడు ఆ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం వల్ల ఐరన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దానివల్ల బాడీ పై నీరసం, అలసిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు పాలకూరలాంటి ఆకుకూరలు తీసుకోవడం వల్ల పెరగడానికి సహాయపడతాయి. పైగా ఆకుకూరల్లో ఐరన్ తో పాటుగా ఎన్నో పోషక విలువలు ఉండడం వల్ల కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కాఫీ తీసుకోవడం వల్ల తలనొప్పి విరోచనాలు లాంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కాఫీకి బదులుగా అల్లం టీ తాగండి. అల్లం లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దానివల్ల కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా వికారం వాంతులు లాంటివి కూడా రాకుండా ఉంటాయి. అయితే ఒక రోజుకు నాలుగు గ్రాములు అల్లం కంటే ఎక్కువగా తీసుకోవద్దు. సాధారణంగా పీరియడ్స్ సమయంలో చాక్లెట్లు తినమని అందరూ చెబుతూ ఉంటారు. అయితే పీరియడ్స్ సమయంలో డార్క్ చాక్లెట్ మాత్రమే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డార్క్ చాక్లెట్లలో అధిక శాతం ఐరన్ మెగ్నీషియం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో మాత్రమే డార్క్ చాక్లెట్ ఉపయోగపడుతుందంటే పొరపాటే.. పిఎస్ సమస్యకు సంబంధించిన లక్షణాలు కనిపించినా కూడా డార్కె చాక్లెట్ తో నివారించుకోవచ్చు. అన్ని రకాల ఆహార పదార్థాలతో పాటు తాజా ఫ్రూట్స్ ఇంకా నట్స్ కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారాన్ని వండుకోవడానికి సమయం లేకపోవడం వల్ల మార్కెట్లో దొరికేటటువంటి జంక్ ఫుడ్ తినడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఆహార పదార్థాలలో ఎక్కువగా ఉప్పు, కారాలను ఉపయోగిస్తారు. వాటి వల్ల కడుపునొప్పి వాంతులు లాంటి జీర్ణ ప్రక్రియకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలకు ఇంత దూరంగా ఉంటే అంత మంచిది అని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా డీహైడ్రేషన్ గురిచేస్తుంది. దాని వల్ల తలనొప్పి, కళ్ళు తిరగడం లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వీటితోపాటుగా జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. కాబట్టి వీలైనంతవరకు ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. ఇక పీరియడ్స్ టైం లో వర్క్ అవుట్ చేస్తూ ఉంటారు. చాలామంది అయితే ఈ టైం లో వర్క్ అవుట్ చేస్తే కనుక కష్టమైనది అస్సలు చేయకూడదని నిపుణులు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో హార్మోన్ పెరగడం ప్రారంభమవుతుంది. అదేవిధంగా భారీ వర్కౌంట్స్ కడుపుపై కూడా చాలా వరకు వత్తిడి ని కలిగిస్తుంది. పీరియడ్స్ సమయంలో స్నానం చేయడం మంచిదే.. కానీ యోగ ప్రకారం ఆయుర్వేద ప్రకారం పీరియడ్స్ టైం లో తలస్నానం చేయకూడదని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే తలపై నీళ్లు పోస్తే ప్రాణవాయువు అనేది కిందికి ప్రవహిస్తుంది. ఇది అసలు మంచిది కాదు. ఒకవేళ తలస్నానం చేయాలి అనుకుంటే గోరువెచ్చ ని నీటితో మాత్రమే చేయాలి. ఇక మరి కొంతమంది పీరియడ్స్ టైం లో రోజంతా కూడా నిద్రపోతూ ఉంటారు. కానీ రోజంతా నిద్రపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కాలంలో నొప్పి, తిమ్మిరి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కొద్దిగా వాకింగ్ చేయాలి. దీనివల్ల మానసిక స్థితిని మెరుగు చేసేటటువంటి హార్మోన్లను పెంచుతుంది. నొప్పిని కూడా తగ్గిస్తుంది. అలాగే మంచి ఆహారం తీసుకోవాలి.

Jyothi Marikanti

No bio available for this author.

  1. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  2. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

  3. "Old 5 Rupee Note : పాత రూ.5 నోటుకు రూ.17 లక్షలు.. మూడు రోజుల్లో రైతుకు ఏం జ‌రిగిందంటే..?"

  4. "Rahul Gandhi : ఏపీలో ‘ఓటు చోరీ’ కలకలం.. రాహుల్ గాంధీ కామెంట్స్‌తో వైసీపీ-కాంగ్రెస్ మధ్య మంటలు..!"

  5. "Anchor Rashmi Gautam : ఇలాంటి ప్రపంచంలో నేను బతకలేను.. జబర్దస్త్ రష్మి భావోద్వేగం..!"

  6. "Modi Rahul Gandhi : జెన్-జీ యువతపై మోదీ, రాహుల్ గురి.. ఆ ఒక్క మీటింగ్‌తో దేశ రాజకీయాలు మారబోతున్నాయా?"

  7. "Ys Jagan : 2024 ఎన్నికల్లో గోల్‌మాల్ జరిగిందా? సీఈసీ ముందు జగన్ అండ్ టీమ్ భారీ నిరసన..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp