
Breakfast : మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఖచ్చితంగా తినకూడని ఆహార పదార్థాలు ఇవే...!
Breakfast : సహజంగా అందరూ ఉదయాన్నే టీ, కాఫీలు టిఫిన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ బ్రేక్ ఫాస్ట్ విషయంలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తున్నారు.. అదేంటంటే బ్రేక్ ఫాస్ట్ తీసుకునే ఆహార విధానంలో కొన్ని తప్పులు చేస్తున్నారు. తినకూడని ఆహార పదార్థాలు కూడా ఉదయం తింటున్నారు. ఈ విధంగా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అసలు మనం ఉదయం తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. మనం ఉదయాన్నే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అప్పుడే శరీరానికి కావాల్సిన శక్తి పోషకాలు మనకు లభిస్తాయి.కొంతమంది ఉదయాన్నే వీటినీ తినడం ఆరోగ్యానికి మంచిది అని అనుకుంటూ ఉంటారు అలాంటి ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
బిస్కెట్స్ అండ్ బ్రెడ్స్: కొంతమంది బిస్కెట్లు బ్రెడ్లు తింటూ ఉంటారు. ఇది కూడా మంచిది కాదు. దీని వలన శక్తి తగ్గుతుంది. దీనివల్ల డిహైడ్రేషన్ కూడా వస్తుంది. బిస్కెట్లు బ్రెడ్స్ తింటే తలనొప్పి కూడా పెరుగుతుంది. దీనివల్ల ఉదయాన్నే శక్తి తగ్గడంతో పాటు ఎస్టిటి సమస్యలు వస్తాయి.
పాన్ కేక్ : కొంతమంది ఉదయాన్నే పాన్ కేక్స్ తింటూ ఉంటారు. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి కానీ వీటిని తింటే శక్తి తగ్గుతుంది. వీటిని తినగానే ఇంకా స్వీట్ గ్రేవింగ్స్ పెరుగుతాయి. కాబట్టి వీటిని తినకపోవడమే మంచిది.
జ్యూస్ లు : కొంతమంది ఉదయాన్నే జ్యూస్ లు తాగుతారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. జ్యూస్ చేసేటప్పుడు అందులో పీచు తగ్గిపోతుంది. ఇది రక్తంలో చక్కెర పరిమాణాన్ని పెంచుతుంది. మీరు షుగర్ వేయకపోయినా దీనివల్ల బాడీలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. షుగర్ పేషెంట్స్ కి ఇది మంచిది కాదు. కాబట్టి పండ్లను జ్యూస్ చేయకుండా అలాగే తినేయాలి. ఇది కూడా ఏదైనా సాలిడ్ ఫుడ్ తీసుకున్నాక తినడం మంచిది..
టీ: ఉదయాన్నే టీ తాగితే కూడా అంత మంచిది కాదు. మీరు ఉదయాన్నే టీ తాగితే పోట్టలో యాసిడ్స్ పెరుగుతాయి. గుండెల్లో మంట నొప్పి మలబద్ధకం లాంటి సమస్యలు తీసుకొస్తుంది. కాబట్టి ఉదయాన్నే టీ తాగడం కూడా అంత మంచిది కాదు. ఉదయాన్నే ఏమైనా తినాలంటే ఫైబర్ పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినడం చాలా మంచిది. అంటే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, ఓట్స్ ,మొలకలు ఇలా మంచి ఫైబర్ ఉన్న పదార్ధాలు తినడం మంచిది.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.