Morning Drinks : ప్రస్తుతం మనం తీసుకునే చెడు ఆహారపు అలవాట్ల వలన మన శరీరంలో కొలెస్ట్రాల్ అనేది ఎంతో వేగంగా పెరుగుతుంది. ఈ కొలెస్ట్రాల్ అనేది పెరగటం వలన గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. అధిక కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటు లాంటి సమస్యల వలన చిన్న వయసులోనే గుండెపోటు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కావున మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అనేది పెరిగితే కచ్చితంగా వైద్యులను సంప్రదించి వాళ్ళు చేసిన సూచనల ప్రకారం మందులను తీసుకోవాలి. అయితే మసాలా మరియు వేయించినటువంటి ఆహారాలను పూర్తిగా మనే యాలి. మీరు ఆహారం పై గనక శ్రద్ధ తీసుకోకపోతే కేవలం మందులే తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచలేరు. ఈ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచేందుకు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకునే ఆహారం కూడా చాలా అవసరం. నిద్ర లేచిన వెంటనే టీ మరియు కాఫీలు తీసుకోకూడదు. అయితే వీటికి బదులుగా ఈ కింది 5 పానీయాలను తీసుకోవటం మంచిది. ఇవి కొలెస్ట్రా ల్ స్థాయిలను నియంత్రించడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా ఎంతో మెరుగుపరుస్తుంది.
ఓట్ మిల్ స్మూతీతో మీ రోజులు మొదలు పెట్టవచ్చు. ఈ ఓట్స్ లో బ్లీటా గ్లూకాన్ అనే ఒక రకమైన కరిగే ఫైబర్ అనేది ఉంటుంది. ఇది LDL కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది. ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగిన చాలా మంచి ఫలితం అనేది దక్కుతుంది. అలాగే నిమ్మకాయ రసం అనేది మన శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగిస్తుంది. అంతేకాక దీనిలో ఉండే విటమిన్ సి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఎంతో మేలుచేస్తుంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది….
టీతో రోజులు మొదలు పెట్టే వారు వీటికి బదులుగా గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చు. గ్రీన్ టీ లో ఉన్న కాటేచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్సు LDL కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతే చియా సీడ్స్ వాటర్ తాగినా కూడా ఎంతో మంచి ఫలితం ఉంటుంది. చియా గింజలలో ఒమేగా-3, ఫైబర్ కొవ్వు ఆమ్లాలు అనేవి అధిక మోతాదులో ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో మరియు వాపును నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ పానీయం తాగటం వలన గుండె సమస్యలను కూడా దూరం చేస్తుంది. మీ దంతాలను బ్రష్ తో క్లీన్ చేసిన తర్వాత ఒక గ్లాసు నీరు తీసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ లో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ ను కూడా కలిపి తీసుకోవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ అనేది కొలెస్ట్రాల్ ను నియంత్రించడంతో పాటు బరువును తగ్గించటంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.