Chicken : చికెన్ ను స్కిన్ తో తినాలా, వద్దా... నిపుణుల అభిప్రాయం ఏమిటి...!
Chicken : ప్రస్తుత కాలంలో ఆదివారం వచ్చింది అంటే చాలు కచ్చితంగా ఇంట్లో చికెన్ ఉండాల్సిందే. ఆ మాటకొస్తే ఆదివారంతో కూడా పని లేకుండా చికెన్ ను తినేవారు ఎంతో మంది ఉన్నారు. అయితే చాలా మంది కెఎఫ్సి పేరుతో చికెన్ 65 ఇలా ఎన్నో రకాలు గా చికెన్ ను తింటూ ఉంటారు. ఇవి కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా ఆరోగ్యానికి కూడా వేలు చేసే గుణాలు ఎన్నో చికెన్ లో ఉండడం వలన వైద్యులు కూడా చికెన్ తినాలని సలహా ఇస్తూ ఉంటారు. అయితే ఈ చికెన్ స్కిన్ తో తినాలా. వద్ద అనే సందేహం మాత్రం మన లో చాలా మందికి ఉన్నది. సాధారణంగా నాటు కోళ్లను కచ్చితంగా స్కిన్ తోనే తిట్టు ఉంటారు. ఎందుకు అంటే స్కిన్ ను తొలగిస్తే రుచి అనేది తగ్గుతుంది అనే భావన ఉంటుంది కాబట్టి. అయితే ఫారమ్ కోళ్లను స్కిన్ తో తింటే మంచిదా.? కాదా. అదే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…
చికెన్ ను స్కిన్ తో తినడం ఎంత మాత్రం మంచిది కాదు అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ స్కిన్ అనేది కూర రుచిని పెంచుతుంది అనడంలో నిజం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యంపై మాత్రం ప్రతికూల ప్రభావం చూపుతుంది అని అంటున్నారు నిపుణులు. అయితే కోడి స్కిన్ లో హానికరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అంతేకాక దీనిలో పెద్దగా పోషక విలువలు కూడా ఏమీ ఉండవు. అయితే ఈ కోళ్లను చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపించడానికి కోళ్ల పెంపక దారులు కోడి యొక్క స్కిన్ పై రసాయనాలు చల్లుతూ ఉంటారు. దీంతో ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది అని అంటున్నారు నిపుణులు. అయితే ఈ చికెన్ ను స్కిన్ తో తీసుకోవడం వలన హానికర కొవ్వులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే స్కిన్ తో చికెన్ తీసుకోవడం వల్ల రక్తపోటు మరియు మధుమేహం,గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు నిపుణులు..
గుండె సమస్యలతో బాధపడేవారు చికెన్ తక్కువగా తీసుకోవాలి అని అది కూడా స్కిన్ లేకుండా తీసుకోవాలని అంటూ ఉంటారు. అయితే ఎన్నో రకాల పరిశోధనలో కూడా చికెన్ యొక్క స్కిన్ ను తీసుకోవటం మంచిది కాదు అని తేలింది. అయితే చికెన్ స్కిన్ తో తినాలి అని అనుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి నష్టం ఉండదు అని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చెప్పాలంటే చికెన్ వండేటప్పుడు డైరెక్ట్ గా వండకుండా ముందు వాటిలో కొద్దిగా ఉప్పు మరియు పసుపు వేసి రెండు లేక మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి వండుకోవాలి. అయితే గుండె సమస్యలతో బాధపడేవారు స్కిన్ కు దూరంగా ఉండడమే చాలా మంచిది అని అంటున్నారు.
Chicken : చికెన్ ను స్కిన్ తో తినాలా, వద్దా… నిపుణుల అభిప్రాయం ఏమిటి…!
ఏది మంచిది : మనలో ఎంతోమంది చికెన్ లెగ్ పీస్ లను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ చికెన్ లో ఉండే బ్రెస్ట్ మీట్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అని అంటున్నారు. వీటిలో కొవ్వు అనేది చాలా తక్కువ మోతాదులో మరియు ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే బరువును తగ్గించడంలో కూడా మేలు చేస్తుంది. అలాగే కండరాలను బలంగా చేసేందుకు కూడా బ్రెస్ట్ మీట్ ఉపయోగపడుతుంది. అలాగే ఈ లెగ్ పీస్ లో కొవ్వు అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే చికెన్ వింగ్స్ లో కూడా కొవ్వు అనేది అధిక మోతాదులో ఉంటుంది అని అంటున్నారు నిపుణులు…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
This website uses cookies.