Elaichi Water : పరగడుపున ఒక గ్లాస్ యాలకుల వాటర్ తీసుకుంటే … శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా…!
Elaichi Water : యాలకులు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో కచ్చితంగా ఉంటాయి. అయితే ఈ యాలకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే. యాలకులు పోషకాల నిధిగా పిలుస్తారు. యాలకుల ను టీలో గాని, తాగి నీళ్ల లో గాని వేసి మరిగించి తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి అని మీకు తెలుసా? యాలకులో విటమిన్లు, విటమిన్ సి, ఖరిజాలు,ఐరన్,మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మైసిన్, డైటరీ ఫైబర్ పుష్కలంగా […]
Elaichi Water : యాలకులు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో కచ్చితంగా ఉంటాయి. అయితే ఈ యాలకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే. యాలకులు పోషకాల నిధిగా పిలుస్తారు. యాలకుల ను టీలో గాని, తాగి నీళ్ల లో గాని వేసి మరిగించి తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి అని మీకు తెలుసా? యాలకులో విటమిన్లు, విటమిన్ సి, ఖరిజాలు,ఐరన్,మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మైసిన్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. యాలకుల నీరు శరీరంలో పేరుకుపోయినటువంటి అధిక కొవ్వు ను కూడా కరిగిస్తుంది. ఇది బరువు ను తగ్గించడంలో కూడా ఎంతో బాగా సహాయం చేస్తుంది. యలకుల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
యలకుల నీటిని ప్రతిరోజు తీసుకోవడం వలన జలుబు, గొంతు నొప్పి లాంటి సమస్యల నుండి బయటపడవచ్చు. ప్రతి రోజు ఒక గ్లాసు యాలకుల నీటిని తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. యాలకుల లో విటమిన్ సి అనేది అధిక మోతాదులో ఉంటుంది. యాలకుల నీటిని తీసుకోవటం వలన జీర్ణ వ్యవస్థ అనేది కూడా ఎంతో బలంగా తయారవుతుంది. అంతేకాక కడుపు నొప్పి సమస్యలను నుండి కూడా ఉపశమనం పొందడంతో పాటుగా శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి ని కూడా పెంచుతుంది. యాలకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెపోటు ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. యాలకులను డిప్రెషన్ తో పోరాడే ఒక ప్రత్యేక సామర్థ్యం కలిగి ఉన్నది.
మీరు ప్రతి రోజు తాగే టీలో ఈ యాలకులను గనక వేసుకొని లేకుంటే యాలకుల పౌడర్ ను వేసుకొని తాగటం వలన మానసిక ఆరోగ్యం ఎంతో బాగా మెరుగుపడుతుంది. ఈ యాలకులు ఆస్తమాను నియంత్రించడంలో కూడా చాలా బాగా మేలు చేస్తాయి. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు యాలకుల నీటిని తాగటం చాలా మంచిది. దీనిని ప్రతినిత్యం తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధించిన సమస్యల నుండి కూడా వెంటనే ఉపశమనం పొందొచ్చు. యాలకులలో బలమైన యాంటీ మైక్రో బయల్ అనే లక్షణాలు ఉన్నాయి. ఇది మంచి దంత పరిశుభ్రతతో పాటు నోటి దుర్వాసనను కూడా శాశ్వతంగా నియత్రించడంలో ఎంతో బాగా సహాయం చేస్తుంది. యాలకులలో లభించే ఫైటో కెమికల్ దుర్వాసనను,బ్యాక్టీరియాని చంపేసి కావిటిస్ మరియు దంతక్షయాన్ని కూడా నిరోధించేందుకు ఎంతో శక్తివంతమైన క్రీమినాశకంగా కూడా పని చేస్తుంది…