Cancer : ఉపవాసంతో క్యాన్సర్ కు చెక్కు పెట్టవచ్చంటే నమ్ముతారా… నిపుణులు ఏం చెబుతున్నారంటే…!
ప్రధానాంశాలు:
Cancer : ఉపవాసంతో క్యాన్సర్ కు చెక్కు పెట్టవచ్చంటే నమ్ముతారా... నిపుణులు ఏం చెబుతున్నారంటే...!
Cancer : ప్రపంచవాప్తంగా చాలామంది కెన్సర్ తో బాధపడుతున్నారు. ప్రతిరోజు దానితో పోరాడుతున్నారు. కొంతమందికి అయితే లాస్ట్ స్టేజి లో ఉన్నపుడు ఇది బయటపడుతుంది. ఇక దీనిని ఎదిరించలేక మరణిస్తూన్నారు. క్యాన్సర్ ని నివారించడానికి పరిశోధకులు వివిధ రకాల పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చికిత్స చేసే క్రమంలో వివిధ అంశాలు బయటపడుతున్నాయి. అందులో క్యాన్సర్ ను తగ్గించడానికి ఉపవాసం కూడా ఒక చక్కటి పరిష్కారమని తెలిసింది. ఉపవాసం ఉంటే క్యాన్సర్ ని తగ్గిస్తుందని అలాగే ఉపవాసం అనేది ఒక న్యాచురల్ కిల్లర్ లాగా క్యాన్సర్ పై పనిచేస్తుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఉపవాసం వలన రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. దీనితో ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడడంతో పాటు క్యాన్సర్ కణాలు కూడా నశిస్తాయి. క్యాన్సర్ కు కీమోథెరపీ చికిత్సను చేస్తారు. అయితే ఈ మందుల ద్వారా హానికరమైన ప్రమాదాలు ఉంటాయి. ఈ విధంగా ఉపవాసం ఉండటం వలన ఆరోగ్యకరమైన కణాలను రక్షిస్తాయని 2012లో ఎలుకల మీద చేసిన పరిశోధన ద్వారా తెలిసింది.
Cancer వారంలో రెండు సార్లు ఉపవాసం..
జర్మన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ చేసిన అధ్యయనంలో అప్పుడప్పుడూ చేసే ఉపవాసాలు కాలేయం క్యాన్సర్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందని తెలుసుకున్నారు. వారంలో ఐదు రోజులు కడుపు నిండా తిన్న తర్వాత రెండు రోజులు ఉపవాసం ఉండడం వలన కాలేయ క్యాన్సర్ ప్రమాదం నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
వైద్యుల సలహా తీసుకోవాలి..
ఉపవాసం ఉండటం ద్వారా క్యాన్సర్ కణాలపై చూపుతుంది అని వైదులు చెబుతున్నారు .అదేవిధంగా షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. అలాగే ఉపవాసం చేయడం వలన శరీరంలో ఉన్న చెడు పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. ముఖ్యంగా ఫ్రీ రాడికల్స్‌ను నివారిస్తుంది. అలాగే క్యాన్సర్ కణాలు ముదరక ముందే ఈ కణాలను నాశనం చేస్తుంది. అయితే క్యాన్సర్ సమస్యతో బాధపడుతూ ఉపవాసం ఉండాలా వద్దా అని ఆలోచించేవారు ముందుగా మీ యొక్క డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.