Health Benefits : ఖర్జూర, పాలు కలిపి తీసుకునే వారికి... ఇది మీకోసమే.. తప్పక తెలుసుకోవలసిన విషయం...?
Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా సేవిస్తారు. ఆరోగ్యకరమైన పాలను తీసుకునేటప్పుడు, దీనితో పాటు మరొక ఆహార పదార్ధమైన ఖర్జూరాన్ని, కూడా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. పాలలో, మన శరీరానికి కావలసిన ప్రోటీన్స్, కాల్షియం, పొటాషియం,ఫాస్ఫరస్ ఇవన్నీ పుష్కలంగా లభిస్తాయి అంటున్నారు నిపుణులు. కొవ్వు ఎక్కువగా ఉన్నప్పటికీ, పాలలోని బయో ఆక్టివ్ పదార్థం శరీరంలో కొవ్వును కరిగేలా చేయగలదు. పాలు ప్రతిరోజు తాగితే ఎముకల్లో పగుళ్లు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందట. ఆరోగ్యకరమైన పాలతో, ఖర్జూరాలను కలిపి తీసుకుంటే,దీని ప్రభావం మరింత రెట్టింపు అవుతుందని, ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. మరి దీని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…
Health Benefits : ఖర్జూర, పాలు కలిపి తీసుకునే వారికి… ఇది మీకోసమే.. తప్పక తెలుసుకోవలసిన విషయం…?
శరీరంలో ఎముకలు, బలంగాను, దృఢంగాను ఉండాలంటే క్యాల్షియం తప్పనిసరి అవసరం. అంతే కాదు దంతాలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరి. వయసుకు తగినట్లు కండరాలు కదలడానికి, ఎముకల సాంద్రతను వాటిలో బలాన్ని కాపాడుటకు కాల్షియం కీలకపాత్రను పోషిస్తుంది. కాదు మీ మెదడు నుంచి శరీరంలోకి ప్రతి భాగానికి సందేశాలను తీసుకువెళ్లాలంటే నరాలకు కాల్షియం తప్పనిసరిగా అవసరమంటున్నారు నిపుణులు. నాలాలలో మీ శరీరం అంతటా రక్తాన్ని సరఫరా చేయాలంటే కాల్షియం ఎంతో సహాయం చేస్తుంది. అంతేకాకుండా, శరీరంలో అనేక విధులను ప్రభావితం చేసే హార్మోన్లను,విడుదల చేయడానికి కూడా కాల్షియం కీలకపాత్రను పోషిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి కాల్షియంన్ని సమృద్ధిగా పొందాలంటే, ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే కాల్షియం పుష్కలంగా అందుతుందో తెలుసుకుందాం.. అలాగే, పాలు, ఖర్జూరంలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రెండిటిని కలిపి తీసుకుంటే శరీరానికి సమృద్ధికరమైన పోషకాలు అందుతాయి అంటున్నారు నిపుణులు. ఇది శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం…
కొందరు తరచూ జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి,రాత్రి పడుకునే ముందు ఖర్జూరం,పాలు కలిపి తాగండి. దీని తో మీ జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఖర్జూరం, పాలు కలిపి తాగితే నిద్రలేని సమస్య కూడా చెక్కుపడుతుంది. ఖర్జూరంలో, ఐరన్ విటమిన్ సి, విటమిన్ డి,యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.ఇవి చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. ఇంకా జుట్టు రాలే సమస్యను తగ్గిస్తూ, జుట్టును ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. ఇంకా సన్నగా ఉన్నవారు,బరువు పెరగాలనుకుంటే,ప్రతిరోజు ఖర్జూరాలను, పాలలో నానబెట్టి రాత్రి పడుకునే ముందు తాగితే మంచిది. ఖర్జూరంలో, కేలరీలు పోషకాలు అధికంగా ఉంటాయి.ఇవి బరువు పెరగడానికి దుహదపడతాయి. పాలలో, ఖర్జూరం కలిపి తాగితే కండరాలకు మంచి పోషకాలు అందుతాయి. ఖర్జూరంలో ప్రోటీన్,విటమిన్, ఖనిజాల పుష్కలంగా ఉంటాయి. ఈ డ్రింక్స్ కండరాల నిర్మాణానికి, దృఢంగా ఉండడానికి ఎంతో సహాయపడతాయి. ఇంకా, బిపిని నియంత్రించే గుణం కూడా పాలలో,ఖర్జూరంకు ఉంటుంది. ఎందుకనగా, దీనిలో మంచి పొటాషియం కూడా ఉంటుంది.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.