Golden Retriever Vs Labrador : మీ పెంపుడు కుక్కలు ఏ జాతివి… వేటిని పెంచుకుంటే మంచిదో తెలుసుకోండి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Golden Retriever Vs Labrador : మీ పెంపుడు కుక్కలు ఏ జాతివి… వేటిని పెంచుకుంటే మంచిదో తెలుసుకోండి…?

 Authored By ramu | The Telugu News | Updated on :9 April 2025,9:00 am

Golden Retriever Vs Labrador : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెంపుడు జంతువులైన కుక్కలనే ఎక్కువగా పెంచకుండా మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా కుక్కలపై ఎంతో ప్రేమను పెంచుకుంటారు. కుక్కను కూడా అంతే విశ్వాసంతో తమ యజమానిపై ప్రేమను చూపిస్తాయి. అయితే, కొందరు ఇంతవరకు కూడా కుక్కని పెంచుకొని వారికి ఎలాంటి కుక్కల్ని తెచ్చుకోవాలో అనే విషయం తెలియదు. మీరు కొత్త పెంపుడు కుక్కను పెంచుకోవాలనుకుంటే.. గోల్డెన్ రిట్రీవర్, లాబ్రడార్ ఆ రెండూ ప్రసిద్ధ జాతులలో ఏది మంచిదో తెలుసా… మిగతా వివరాలు తెలుసుకుందాం…
కొత్త పెంపుడు కుక్కలని మీ జీవితంలోనికి తీసుకురావాలని అనుకుంటే, గోల్డెన్ రిట్రీవర్, లాబ్రడార్ అనే రెండూ ప్రసిద్ధ జాతుల్లో ఒకదాన్ని ఎంచుకోవాలనుకుంటే, ఈ పోలికా మీకు సరైనది.

Golden Retriever Vs Labrador మీ పెంపుడు కుక్కలు ఏ జాతివి వేటిని పెంచుకుంటే మంచిదో తెలుసుకోండి

Golden Retriever Vs Labrador : మీ పెంపుడు కుక్కలు ఏ జాతివి… వేటిని పెంచుకుంటే మంచిదో తెలుసుకోండి…?

Golden Retriever Vs Labrador మొదట పెంపుడు కుక్కల పరిమాణం, బరువు

మొదట పెంపుడు కుక్కని కొనేటప్పుడు దాని పరిమాణం , బరువు గురించి చెప్పాలంటే, రెండు జాతుల మధ్యస్థ నుంచి పెద్ద పరిమాణంలో ఉంటాయి. సగటున గోల్డెన్ రిట్రీవర్ బరువు 25 నుంచి 34 కిలోల వరకు, ఎత్తు 21.5 నుంచి 24 అంగుళాల వరకు ఉంటుంది. లాబ్రడార్ కొంచెం ఎక్కువ బరువు ఉంటుంది. ల్యాబ్రాడారు సగటు బరువు 29 నుంచి 30 కిలోల వరకు, ఎత్తు 21.5 నుంచి 24.5 అంగుళాల వరకు ఉంటుంది. చిన్న అపార్ట్మెంట్లలో వీటిని ఉంచటం కొంచెం కష్టంగా ఉండవచ్చు. కానీ క్రమం తప్పకుండా వ్యాయామం, మానసిక ఉద్దీపన ద్వారా అవి బాగా అలవాటు పడతాయి. రెండు జాతులకు చెందిన కుక్క వ్యక్తిత్వాలలో చాలా సారూప్యతలు ఉన్నప్పటికీ, గోల్డెన్ రిట్రీవర్ కొంచెం ఎక్కువ ఎక్స్ట్వర్ట్ వర్క్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది అపరిచితులతో సులభంగా కలిసిపోతుంది. మరోవైపు, లాబ్రడార్ కొంచెం సమయం తీసుకుంటుంది. ఒకసారి అలవాటు పడితే చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది.

రెండు జాతులకు బలమైన శక్తి స్థాయిలు ఉన్నాయి. వాటికి ప్రతిరోజు నడవడం ఆటలు ఆడటం మానసిక శిక్షణ ఇవ్వడం చాలా ముఖ్యం. అవి బద్దకంగా ఉంటే వితంగా గా ప్రవర్తించవచ్చు.
గోల్డెన్ రిట్రీవర్ కంటే లాబ్రడార్ కొంచెం ఎక్కువ శక్తివంతమైనది, తే కాదు చురుకైనది కాబట్టి,దాని రోజువారి వ్యాయామం అవసరం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. మీరు స్నేహపూర్వకంగా, ప్రేమతో నిండిన కుక్కను కోరుకుంటే, ఈ రెండు జాతులు కచ్చితంగా సరిపోతాయి. అవి కుటుంబ ఆధారితమైనవి, పిల్లలతో బాగా కలిసిపోతాయి. యజమానితో చాలా మంచి సంబంధాన్ని ఏర్పరచుకుంటాయి.

కుక్క కాపలా స్వభావం పరంగా లాబ్రడార్ కొంచము ముందు ఉంటుంది. ఇది చాలా చురుకైన కాపలా కుక్క కానప్పటికీ, లాబ్రడార్ ఏదైనా అసాధారణమైనది గ్రహిస్తే, మిమ్మల్ని అప్రమత్తం చేయగలదు. రెండు జాతులకు డబ్బులు కోర్టు ఉండటం వల్ల గ్రూమింగ్ లేదా శుభ్రపరచడం అవసరం. సమంత తప్పకుండా బ్రష్ చేయకపోతే, వెంట్రుకలు రాలిపోతాయి. చర్మ సమస్యలు కూడా రావచ్చు.
అబ్రా డార్క్ అంటే గోల్డెన్ రిట్రీ వర్ బొచ్చు కొంచెం పొడవుగా, సిల్కిగా ఉంటుంది కాబట్టి, దానికి కొంచెం ఎక్కువ శ్రద్ధ అవసరం. అప్పుడప్పుడు ప్రొఫెషనల్ గ్రూమింగ్ అవసరం కావచ్చు. ఆరోగ్య సమస్యలు- ఇద్దరికీ హిప్పు డస్ ప్లేస్సియా, కంటి సమస్యలు లేదా కొన్ని గుండె సంబంధిత ప్రమాదాలు కూడా ఉన్నాయి. సమస్యలను ముందుగానే గుర్తించడానికి క్రమం తప్పకుండా పశు వైద్యున్ని సంప్రదించడం అవసరం. మీరు దీన్ని ఎంచుకున్నా శ్రద్ధ,ప్రేమతో వాటిని అపార్ట్మెంట్లో ఉంచడం సాధ్యమే. మీరు కొంచెం తక్కువ శక్తి ఉన్న కుక్కను కోరుకుంటే, గోల్డెన్ రిట్రీవర్ మంచిది. ఎక్కువ చురుకుగా ఉంటే, లాబ్రా డార్ ఉత్తమ ఎంపిక అవుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది