Medicinal Plants : వర్షాకాలంలో ఈ మొక్కల్ని మీ ఇంట్లో పెంచుకోండి... అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం...?
Medicinal Plants : కొన్ని శతాబ్దాల కాలం నుంచి ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను పలు రకాలు చికిత్సకు మెడిసిన్ గా వాడుతూ వస్తున్నారు. ఇవన్నీ శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇలాంటి మొక్కల్ని మన ఇంట్లో పెంచుకుంటే, ఆయుర్వేద ఔషధ మొక్కలు వాటితో కలిగే ఆరోగ్య సులభంగా పొందవచ్చు. అలాంటి ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఏమిటో.. వాటిలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.. ప్రకృతి ఎన్నో రకాల మొక్కలను అందిస్తుంది. ఔషధ గుణాలు కలిగిన ఆయుర్వేద మొక్కలు కూడా ఉంటాయి. శతాబ్దాల కాలం నుంచి ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలను పలు రకాల చికిత్సలకు వినియోగిస్తున్నారు. శరీర ఆరోగ్యాన్ని కాపాడుటకు వాటిలో కొన్నిటిని మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. వర్షాకాలంలో ఇంట్లో సులువుగా పెంచుకోగలిగే,ఆయుర్వేద ఔషధ మొక్కలు,వాటితో కలిగారు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
Medicinal Plants : వర్షాకాలంలో ఈ మొక్కల్ని మీ ఇంట్లో పెంచుకోండి… అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం…?
పుదీనా ఆకులు,వీటి వాసన చూస్తే మైండ్ అంతా రిఫ్రెష్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సువాసనతో కూడిన పుదీనాని వాడుతుంటారు. పుదీనా ఆకులని వంటల్లో రుచి కోసమే కాదు,ఆరోగ్యానికి కూడా దివ్య ఔషధం. మంచి వాసనను కూడా అందిస్తుంది. ఇంకా,టేస్టును పెంచుతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ ఆకులని ప్రతిరోజు మన ఆహారంలో చేర్చుకున్నట్లైతే, అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా, టీ,స్వీట్లు,మొదలైన వాటికి రుచి సువాసన కోసం దీన్ని కలుపుతారు.ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. కడుపుబ్బరం సమస్యలను తగ్గిస్తుంది.
కరివేపాకు : కరివేపాకు వంటల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. కరివేపాకు ఆకులలో కాల్షియం,మెగ్నీషియం, ఐరన్,ఫాస్ఫరస్,జింక్, ఫీచు పోషకాలతో పాటు విటమిన్ సి, విటమిన్ బి,విటమిన్ ఇ, లు అధికంగా ఉంటాయి. దీనిని ప్రతి ఆహారాల్లో చేర్చుకున్నట్లయితే దీని ప్రయోజనాలను పొందవచ్చు. కరివేపాకును పప్పు,సాంబార్ వంటి వంటకాలలో ఎక్కువగా వాడుతుంటారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఇది సరైన ఆహారం. ఇంకా, నాడీ సంబంధిత వ్యాధుల్ని, క్యాన్సర్ వంటి వ్యాధుల్ని అడ్డుకోగలదు. ఇందులో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
లెమన్ గ్రాస్ : లెమన్ గ్రాస్ సువాసనతో నిండి ఉంటుంది. దీన్ని టీ,సూపు, థాయ్ వంటకాలలో వాడుతారు. ఈ మొక్క ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఫంగల్, ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా నుండి శరీరాన్ని రక్షించగలదు. లెమన్ గ్రాసులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. లెమన్ గ్రాస్ లో అనేక పోషకాలు ఉంటాయి. శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ ను పటిష్ట పరుస్తుంది. రోగాలతో పోరాడే శక్తి ఉంటుంది.
గిలోయ్ : రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలకు ప్రసిద్ధి చెందినది గిలోయ్. ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది తిప్పతీగలో యాంటీ ఫంగల్ యాంటీబ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి వీటిని మెడిసిన్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. గిలోయ్ అంటే తిప్పతీగ. ఈ ఆకులను రోజుకు రెండుసార్లు తింటే శరీరంలో రోగనిరోధక శక్తి భాగవృద్ది చెందుతుంది.రోగాల బారిన పడకుంటా కాపాడుతుంది. డయాబెటీస్ సమస్యలను నివారిస్తుంది. తిప్పతీగ చూర్ణం ప్రతి రోజు ఉదయం,సాయంత్రం తీసుకుంటే, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.
తులసి : హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసి మొక్క అందరి ఇంటి ముంగట ఉంటుంది. హిందువులు తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈరోజు తులసి చెట్టుకు నీరు పోసి ఉదయం, సాయంత్రం దీపాలు వెలిగిస్తే చాలా మంచిదాన్ని నమ్ముతారు. చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుందని భక్తుల నమ్మకం అయితే తులసి మొక్క కేవలం మతపరమైన ప్రాముఖ్యతలకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అనేక ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఇది మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులు అంటే, దగ్గు, జ్వరం, జలుబు వంటివి రాకుండా చేస్తుంది.అలాగే జీవక్రియను మెరుగుపరుస్తుంది.
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
This website uses cookies.