Home » Health » Guava Amzing Health Benfits In Telugu
Health

Guava : డాక్టర్లను సైతం ఆశ్చర్యపరిచే ఆకు… దీంతో ఎలాంటి వ్యాధి అయినా మటుమాయమే…!

Authored By
aruna
The Telugu News | Published on: February 26, 2024, 4:00 pm
Advertisement

Guava : పండ్లలో రారాజు జామపండు. ఈ జామ పండ్లు ఎన్నో పోషకాలు ఉన్నాయి.. షుగర్, బిపి వ్యాధిగ్రస్తులు దీన్ని తీసుకోవడం వలన రక్తంలో చక్కెర లెవెల్స్ ని తగ్గిస్తాయి. అలాగే అధిక రక్తపోటును కూడా తగ్గిస్తాయి.. ఈ జామ పండు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అయితే జామ ఆకులతో కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు..
పచ్చగా నిగ నిగలాడే జామకాయలు అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. దీనిలో సోడియం, కాల్షియం, పొటాషియం, సల్ఫర్, మాంగనీస్ ,మెగ్నీషియం లాంటి పోషకాలు ఈ ఆకులలో పుష్కలంగా ఉంటాయి. జామ ఆకుల వల్ల బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..

Advertisement

జామ ఆకులతో చేసిన టీ తాగితే అధిక బరువుకి చెక్ పెట్టవచ్చు..జామ ఆకులతో జుట్టు రాలే సమస్యను అరికట్టవచ్చు. గుప్పెడు జామకుల్ని 20 నిమిషాలు నీళ్లలో మరిగించాలి. తర్వాత వాటిని వడకట్టి ఆ నీటిలో గోరింటాకు, మందార ఆకు ముద్దను వేసి కొద్దిసేపు ఉంచాలి. దీనిని తర్వాత తలకి అప్లై చేసి కొంత సమయం తర్వాత గాడత తక్కువ గల షాంపుని తీసుకొని తల స్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే జుట్టు రాలే సమస్య నుంచిబయటపడవచ్చు…చిన్నపాటి గాయాలు ఇబ్బంది పెడుతుంటే ఆ ప్రాంతంలో జామ ఆకులను వృద్ధి చూడండి మంచి ఫలితం ఉంటుంది.
జామ ఆకుల వల్ల కొల్లజెన్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది చర్మాన్ని రక్షిస్తుంది. జామ ఆకును జీర్ణ సంబంధత వ్యాధి చికిత్సకు వినియోగిస్తారు.

గొంతు నొప్పి, చిగుళ్ల వ్యాధి, పంటి నొప్పి కోసం తాజా జామకుల్ని వినియోగించాలి.  జామ ఆకులలో రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది. శరీరంలోనే చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది. ఈ జామాకులలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, ఆంటీ ఇంప్లమెంటరీ లక్షణాలతో విటమిన్ సి లక్షణాలు కూడా ఉంటాయి. జామ ఆకులలో క్యాన్సర్ వ్యతిరేక గుణాలు ఉంటాయి. జామాకులలో ఉండే ఆంటీ మైక్రో బయల్ గుణాలు మనకి వ్యాధులు రాకుండా చేస్తాయి. కార్బోహైడ్రేట్లు చక్కెరగా మారే ప్రక్రియను ఈ జామ ఆకులు అడ్డుకుంటాయి. దాంతో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి