Hair Tips : చాలామందికి జుట్టు పొడవుగా ఉండాలి అని అనిపిస్తుంటుంది. పొడవుగా కావాలని వివిధ రకాల చిట్కాలను ఫాలో అవుతూ ఉంటారు. అయితే కొన్ని చిట్కాల వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.ఏవి పడితే అవి వాడితే జుట్టుకు హాని కలగవచ్చు. జుట్టు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలంటే ఈ చిట్కాను ఒకసారి ట్రై చేయండి. మనం రోజు ఇంట్లో వండుకునే బియ్యంతో ఈ చిట్కాను తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి దాంట్లో రెండు గ్లాసుల నీళ్లు పోసి ఒక గంట నానబెట్టుకోవాలి. తర్వాత పది మందార పువ్వులు తొడిమలు తీసి నానబెట్టుకున్న బియ్యంలో రెక్కలు విడదీసి వేసుకోవాలి.
మందార పువ్వులు దొరకవు అనుకున్నవారు హెబిస్కస్ పౌడర్ ను వాడుకోవచ్చు. తర్వాత వీటిని చేతితో క్రష్ చేసి మెత్తగా చేసుకోవాలి. చేతులతో చేసుకోలేకపోతే మిక్సీ పట్టుకోవచ్చు. తర్వాత కలబంద తీసుకొని శుభ్రంగా కడిగి లోపల ఉండే గుజ్జును తీసుకొని మందార పువ్వులతో పాటు క్రష్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక పల్చటి గుడ్డ తీసుకొని వడకట్టుకోవాలి. తర్వాత ఇందులో ఒక చెంచా కాస్టర్ ఆయిల్ కలుపుకోవాలి. కాస్టర్ ఆయిల్ వద్దు అనుకున్న వాళ్లు కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకోవడం ఇష్టం లేనివారు డైరెక్టుగా కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని కంటైనర్ లో పెట్టి 20 రోజుల వరకు భద్రపరుచుకోవచ్చు. ఇది మిశ్రమం లాగా ఉంటుంది. దీనిని జుట్టు కుదురుల నుండి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేయడం వలన రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు రాలడం తగ్గిపోతుంది. దీని వలన కుదుళ్ళు బలంగా తయారవుతాయి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత షాంపూ తో కానీ కుంకుడుకాయతో కానీ తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వలన జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. బట్టతల వచ్చిన వారికి తిరిగి జుట్టు వస్తుంది. ఇది న్యాచురల్ రెమిడీ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అన్ని వయసుల వారు ఈ రెమిడిని ఉపయోగించవచ్చు.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.