Tollywood : తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకుకోవడం ఫిల్మ్ మేకర్స్ వల్ల కావడం లేదు. తాము అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తున్నారు… వాటిల్లో కేవలం 10 నుండి 15 శాతం మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. కొందరు దర్శకులు ఎలా తీసినా కూడా సక్సెస్ అవుతూ ఉంటే మరి కొందరు ప్రాణం పెట్టి సినిమాలను తెరకెక్కించినా కూడా అది బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతోంది. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే విషయమై పతాక స్థాయిలో చర్చ జరుగుతోంది.
మొన్న సీతారామం మరియు బింబిసార సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ రెండు సినిమాలు కూడా విభిన్నమైన జోనర్ లో రూపొందిన సినిమాలు అనే విషయం తెల్సిందే. అయినా కూడా ఆ రెండు సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ సినిమాల నిర్మాతలు కూడా ఊహించని వసూళ్లు రాబోతున్నాయి. ముఖ్యంగా సీతారామం సినిమాను ఏకంగా మణిరత్నం క్లాసిక్ మూవీ గీతాంజలితో పోల్చుతూ చేస్తున్న కామెంట్స్ ఫిల్మ్ మేకర్స్ కు కూడా ఆశ్చర్యంను కలిగిస్తున్నాయి.
ఎన్నో సినిమాలు వస్తున్నాయి.. వాటిల్లో ఈ సినిమాల యొక్క ప్రత్యేకత ఏంటో ఏం అర్థం కావడం లేదని.. అయినా కూడా ఎందుకు ఇంతగా ప్రేక్షకులు చూస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ ఫిల్మ్ మేకర్స్ చర్చించుకుంటున్నారు. ఈ ప్రేక్షకుల అభిరుచి ఏంటో అర్థం అవ్వడం లేదు. ఎలాంటి సినిమాలను ఆధరిస్తున్నారో తెలుసుకోవడం కష్టంగా ఉంది. మాస్ సినిమా లను ఇష్టపడుతున్నారని ఆ సినిమాలు తీస్తే ఆడటం లేదు.. కామెడీ సినిమాలు సక్సెస్ అవుతాయి అని తీస్తే ఎఫ్ 3 కూడా నిరాశ పర్చింది అంటూ ఫిల్మ్ మేకర్స్ ఏకంగా ప్రేక్షకుల అభిరుచి తెలుసుకోలేక తిట్టుకుంటున్నారట. కొత్తదనంతో తీస్తే పట్టించుకుంటారా అంటే అది కూడా లేదు. దాంతో ఫిల్మ్ మేకర్స్ జుట్టు పీక్కుంటున్నారు.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.