
Hair Tips : ప్రస్తుతం మానం జీవిస్తున్న జీవన శైలి విధానంలో కొన్ని మార్పుల వలన చాలామందిలో జుట్టు రాలే సమస్య రోజురోజుకీ ఎక్కువైపోతుంది. ఈ సమస్య వయసు తరహా లేకుండా అందరిలోనూ కనిపిస్తుంది. దీనికోసం ఎన్నో వేల ఖర్చులు చేస్తూ కొన్ని రకాల ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తున్నారు. మార్కట్లో దొరికే ప్రొడక్ట్స్ లలో ఎక్కువగా కెమికల్స్ ఉంటాయి. ఇవి వాడడం అనేది చాలా ప్రమాదకరం. అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎటువంటి ఖర్చు లేకుండా జుట్టు పెరిగేలా చేసుకోవచ్చు. దాని కోసం ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని దానిలో నాలుగు రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు జుట్టు రాలడం తగ్గించి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది.
కరివేపాకు అనేది తెల్ల జుట్టు తగ్గించి నల్లగా అవడానికి చాలా బాగా సహాయపడుతుంది. తర్వాత ఒక కలమందను తీసుకొని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి రెండు వైపులా సైడ్ ని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అదే కడాయిలో వేసుకోవాలి. దీనికోసం ప్లాంట్ బేస్ అలోవెరా మాత్రమే తీసుకోవాలి. తర్వాత రెండు స్పూన్ల మెంతులని వేయాలి. ఈ మెంతులు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు మాశ్చరైజ్ చేసి జుట్టు మృదువుగా మెరిసిపోవడంలో చాలా బాగా సహాయపడుతుంది. తర్వాత ఒక కప్పు కొబ్బరి నూనె కూడా వేసి బాగా కాగనివ్వాలి ఇలా నూనె కాగిన తర్వాత స్టవ్ ఆపుకొని దానిని బాగా చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత నూనెను వడకట్టుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి.
Hair Tips on Dill Curry leaves
ఇలా ఈ ఆయిల్ ని వారంలో రెండుసార్లు జుట్టుకి అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకనగా దీనిలో కలమంద వేసుకుంటాము కావున ఎక్కువకాలం నిల్వ ఉండదు. దీనిని రోజు రాసుకోవచ్చు. లేదా రాసుకున్న ఒక గంట తర్వాత తలస్నానం కూడా చేయవచ్చు. నూనె రాసుకున్నప్పుడు జుట్టు చివర్ల నుంచి కుదురుల వరకు బాగా అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. ఈ ఆయిల్ రాసుకోవడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. జుట్టు పెరగదు అని నిరాశ పడే వారికి ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్ ని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.