Home » Health » Hair Tips Use These Coffee Hair Pack Hair Grow Silky And Smoothly
Health

Hair Tips : కాఫీ త్రాగటానికే కాదు, జుట్టు పెరగడంలో కూడా సహాయపడుతుందని మీకు తెలుసా…?

Authored By
aruna
The Telugu News | Published on: August 29, 2022, 3:00 pm
Advertisement

Hair Tips : ప్రస్తుతం జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా అందరికీ జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారింది. అయితే జుట్టు రాలడాన్ని తగ్గించడానికి వివిధ రకాల చిట్కాలను ఫాలో అవుతుంటారు. అయితే కాఫీ తో చేసిన ఈ చిట్కాను కనుక ట్రై చేశారంటే జుట్టు మృదువుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. కాఫీ తాగడానికే కాదు జుట్టు సంరక్షణలో కూడా సహాయపడుతుంది. గరుకు జుట్టును సిల్కీగా, స్మూత్ గా మార్చగలిగే లక్షణం కాఫీకి ఉంటుంది. అలాగే జుట్టు ఒత్తుగా పెరగడానికి ఇది సహాయపడుతుంది. కాఫీ తో తయారు చేసిన హెయిర్ ప్యాక్ ను తలమాడుకు రాసుకుంటే జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. అయితే కాఫీ తో హెయిర్ ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కాఫీ హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో గుడ్డులోని తెల్లసొన ను వేసుకోవాలి. తర్వాత అందులో మూడు టేబుల్ స్పూన్ల కాఫీ పొడిని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని జుట్టు మొదళ్ల నుంచి చివర్ల దాకా బాగా రాసుకోవాలి. ఈ విధంగా రాసుకున్న జుట్టు మొత్తాన్ని హెయిర్ మాస్క్ తో కవర్ చేయాలి. ఆ తర్వాత కొన్ని నిమిషాల పాటు వేళ్ళతో తలమాడును సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత 15 నిమిషాల వరకు అలా ఉండి తర్వాత ఏదైనా షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ హెయిర్ ప్యాక్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కనుక అన్ని వయసులవారు ఉపయోగించవచ్చు. అలాగే కాఫీ పొడితో మరో హెయిర్ ప్యాక్ ను కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగంటే.

Hair tips use these coffee hair pack hair grow silky and smoothly

Advertisement

ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడి కి సమానంగా తేనెను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పూసుకోవాలి. ఇలా ఒక నలభై నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత మీ రోజువారి షాంపూతో తలస్నానం చేయాలి. అలాగే ఇంకొక చిట్కా ఏంటంటే, మూడు టేబుల్ స్పూన్ల కాఫీ పొడితో సమానంగా పెరుగును కలుపుకోవాలి. దీనికి కొన్ని చుక్కలు తాజా నిమ్మరసం జోడించాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఒక 30, 40 నిమిషాల దాకా ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెలో రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ కలుపుకోవాలి. తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కలబంద రసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత జుట్టుకు పట్టించి 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి