Hair Tips Use This Oil To Get Hair Faster
Hair Tips : ప్రస్తుతం చాలామందికి జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. దీనికి కారణం వాతావరణ మార్పులు, తినే ఆహారంలో పోషకాలు లోపించడం, పనిలో ఒత్తిడి, ఆందోళన ఇలా ఎన్నో కారణాల వలన జుట్టు రాలే సమస్యలు ఎక్కువవుతున్నాయి. అలాగే జుట్టు రాలడంతో పాటు తెల్ల వెంట్రుకలు రావడం, చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. వాటిని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నారు.. వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇవి జుట్టుకి కూడా హాని కలుగచేస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా జుట్టు ఒత్తుగా, పొడవు పెరిగేలా చేసుకోవచ్చు. చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
దీనికోసం ముందుగా మనం కొద్దిగా అల్లం తీసుకొని తొక్క తీసుకోవాలి. తర్వాత మెత్తగా తురుముకోవాలి. అల్లం లో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడతాయి. అంతేకాకుండా చుండ్రు, దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. తర్వాత ఈ ఆయిల్ కోసం రెండు స్పూన్ల లవంగాలను తీసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. లవంగాలు జుట్టు సిల్కీగా పొడవుగా పెరగడంలో సహాయపడతాయి. లవంగాలు కూడా యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా కలిగి ఉండడం వలన చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గిస్తాయి. స్కాల్ప్ పై ఉండే ఇన్ఫెక్షన్స్ తగ్గడం వలన జుట్టు బలంగా పెరుగుతుంది.
Hair Tips Use This Oil To Get Hair Faster
తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో రెండు స్పూన్ల లవంగాల పొడి, తురిమి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి. తర్వాత అందులో ఒక కప్పు కొబ్బరి నూనె వేసుకొని బాగా కలిపి స్టవ్ మీద ఐదు పది నిమిషాల పాటు మరిగించుకోవాలి. అల్లం లో ఉండే తడి మొత్తం ఇంకిపోయేంతవరకు నూనెను మరగనివ్వాలి. తర్వాత నూనె చల్లార్చుకుని వడకట్టుకొని ఒక స్పూన్ కాస్టర్ ఆయిల్ లేదా విటమిన్ ఈ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత నూనేను ఏదైనా గాజు సీసాలో పెట్టి నెల రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఈ నూనెను రాసుకునేటప్పుడు కొద్దిగా వేడి చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు కుదుళ్ల దగ్గర నుండి చివర్ల వరకు రాసుకోవాలి. తర్వాత నాలుగు గంటల పాటు ఉండనివ్వాలి. ఆ తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.