having throat problems then do not take these foods
Throat problems : గొంతు సమస్యలు ఉంటే సహజంగానే ఎవరికైనా సరే ఆహారం తినేటప్పుడు, నీరు తాగేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మింగడం కష్టతరమవుతుంటుంది. జలుబు కారణంగా గొంతులో వాపు వచ్చినప్పుడు ఇలా అవుతుంది. దీంతో ఏ పదార్థాన్ని తిన్నా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ఈ సమస్య ఉన్నవారు వేడిగా ఉండే పదార్థాలను తింటే కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ సమస్య ఉన్నవారు తినకూడని ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* గొంతు సమస్యలు ఉన్న వారు సిట్రస్ ఫలాలను తినరాదు. నిమ్మ, నారింజ, కివీలు, పైనాపిల్ వంటి పండ్లను తినకూడదు. తింటే గొంతులో ఇర్రిటేషన్ కలుగుతుంది. దీంతో సమస్య మరింత ఎక్కువవుతుంది.
* గొంతు సమస్యలు ఉంటే టమాటాలను కూడా తీసుకోకూడదు. టమాటాలు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి సమస్య తీవ్రతను పెంచుతాయి.
* చింత పండులో ఉండే పుల్లదనం గొంతు సమస్యను మరింత పెంచుతుంది. వాపును కలిగిస్తుంది. దురద వస్తుంది. అందువల్ల దీన్ని కూడా మానేయాలి.
having throat problems then do not take these foods
* పచ్చళ్లు, చాట్ మసాలా వంటి పదార్థాలను కూడా గొంతు సమస్యలు ఉన్నవారు తినకూడదు.
* గొంతు సమస్యలు ఉన్నప్పుడు శరీర రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తినాలి. నూనె పదార్థాలు, వేపుళ్లను తింటే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందువల్ల ఈ పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి.
* సాధారణ సమయాల్లో పెరుగును తినవచ్చు. మంచిదే. కానీ గొంతు సమస్యలు ఉన్నవారు తింటే శరీరంలో శ్లేష్మం ఎక్కువవుతుంది. దీంతో సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. కనుక పెరుగును కూడా తినరాదు.
* బ్రెడ్, చిప్స్ వంటి పదార్థాలతోపాటు మద్యం సేవించడం మానేయాలి. అలాగే కెఫీన్ ఉండే టీ, కాఫీలను తాగరాదు. దీని వల్ల గొంతు పొడిగా మారి సమస్య ఎక్కువవుతుంది. వీటితోపాటు కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూస్‌లను తాగడం కూడా మానేయాలి.
గొంతు సమస్యలు ఉన్నప్పుడు ఈ పదార్థాలను తినడం మానేయడం వల్ల ఆయా సమస్యలు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.