Home » Entertainment » Sukumar About Telugu Heroines At Play Back
Entertainment

Sukumar : అది వర్కవుట్ అయ్యేనా.. సుకుమార్‌వి ఉత్త మాటలేనా?

Authored By
Cinema Desk
The Telugu News | Published on: March 7, 2021, 6:58 pm
Advertisement

ప్రస్తుతం సుకుమార్ పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. సుకుమార్ దగ్గర పని చేసిన వారు తమ సొంతంగా నిలబడిపోతోన్నారు. అదిరిపోయే హిట్లను కొట్టేస్తున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టేశాడు. ఇక సుకుమార్ స్నేహితుడు హరి ప్రసాద్ జక్కా ఇప్పుడు ప్లే బ్యాక్ సినిమాతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ మూవీని పాన్ ఇండియాలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

ఈ క్రమంలో సక్సెస్ మీట్‌లో సుకుమార్ మాట్లాడుతూ కాస్త ఎక్కువే చేశాడనిపిస్తోంది. అనన్య నాగళ్ల గురించి మాట్లాడుతూ.. ఇకపై తాను తెలుగమ్మాయిలనే హీరోయిన్లుగా పెట్టుకుంటానని చెప్పుకొచ్చాడు. తాను సెట్‌లో వెంట వెంటనే డైలాగ్స్ మారుస్తుంటానని, అదే తెలుగు వాళ్లైతే వెంటనే చెప్పేస్తారు.. కానీ హిందీ వాళ్లైతే.. దాన్ని రాసుకుని నేర్చుకుని చెప్పేసరికి లేట్ అవుతుందని, అంత సేపు అక్కడున్న వాళ్లంతా నన్ను వెరైటీ చూసేవారని చెప్పుకొచ్చాడు.

Sukumar about telugu heroines At Play Back

Advertisement

Sukumar : సుకుమార్‌వి ఉత్త మాటలేనా ?

రంగస్థలంలో కూడా తెలుగు వచ్చని సమంతను హీరోయిన్‌గా పెట్టుకున్నానని పుష్ప కోసం తెలుగు హీరోయిన్‌నే అనుకున్నామని, బన్నీ కూడా పెట్టుకుందామని అన్నాడు. కానీ చివరకు అది కుదరలేదు.. కానీ తెలుగు వచ్చిన రష్మికను పెట్టుకున్నామని అన్నాడు. అయితే వచ్చే సినిమాలో మాత్రం కచ్చితంగా తెలుగు అమ్మాయినే తీసుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు సుకుమార్ ఉన్న రేంజ్‌కు తెలుగు అమ్మాయిని పెట్టుకోవడం సాధ్యమయ్యే పనేనా అని నెటిజన్లు అంటున్నారు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి