Home » Health » Health Benefits For Weight Loss Drink Ajwain Water
Health

Health Benefits : ప్రతిరోజు వాము నీటిని త్రాగారంటే… ఊబకాయం మటుమాయం…

Authored By
aruna
The Telugu News | Published on: September 28, 2022, 6:30 am
Advertisement

Health Benefits : ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో చాలామంది ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. బాడీ బరువు పెరగటం వలన వివిధ రకాల ఆనారోగ్య సమస్యలు వస్తాయి. సాధారణంగా చాలామంది నూనె పదార్థాలు తీపి వంటకాలను తినడానికి ఇష్టపడుతుంటారు. దీని కారణంగా తరచూ ఊబకాయం బారిన పడుతూ ఉంటారు. ఒక్కసారి శరీరం బరువు పెరిగిందంటే తగ్గించుకోవడం చాలా కష్టం. ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా రోజువారి పనిలో పడి జిమ్ కు వెళ్లలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈజీగా బరువు తగ్గాలంటే ప్రత్యేక పానీయాన్ని తాగవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Advertisement

బరువు తగ్గించుకోవడానికి వాము బాగా సహాయపడుతుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీన్ని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. దీని ద్వారా పొట్టకు సంబంధించిన సమస్యలన్నీ దూరం చేసుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ మెరుగుపడి మలబద్ధకం, అజీర్తి లాంటి సమస్యలు తగ్గుతాయి. కాబట్టి వాము నీటిని తాగడం వలన పొట్ట నడుము కొవ్వు తగ్గుతుందని చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం ఏమీ తినకుండా వాము వాటర్ తాగితే ఈజీగా బరువును తగ్గించుకోవచ్చు.

Health Benefits for weight loss drink ajwain water

Advertisement

వాము నీటిని కొద్దిగా వేడి చేసిన తర్వాత కూడా త్రాగవచ్చు. అలాగే బరువు తగ్గడానికి 25 గ్రాములు వాము గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా నెల రోజులు పాటు వాము వాటర్ తాగితే శరీరంలో తేడా వస్తుంది. ఒకవేళ వాము గింజలను రాత్రి నీటిలో నానబెట్టడం మర్చిపోతే ఉదయాన్నే ఒక స్పూన్ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి మరగబెట్టాలి. ఇప్పుడు అందులో ఐదు ఆరు తులసి ఆకులను వేయాలి. ఆ తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత తాగితే మంచి ఫలితం లభిస్తుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి