Health Benefits Maredu Tree best leaf heat reduction in body
Health Benefits : హిందువులు వేప చెట్టు, రావి చెట్టు, మరేడు చెట్టు ఇలా ఎన్నో చెట్లను పవిత్రమైనవిగా భావించి పూజిస్తారు. ఇలాంటి వృక్షాలలో ఎంతో ముఖ్యమైనది మారేడు చెట్టు. పూర్వకాలం నుంచి మారేడు చెట్టు ప్రాచుర్యంలో ఉంది. ఈ మారేడు చెట్టు అంటే ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరం. మారేడు ఆకులు మూడు ఆకులు కలిపి ఒకే ఈనెల ఉంటాయి. ఇవి ఆ పరమశివుడి మూడు కన్నులను సూచిస్తాయని హిందువుల నమ్మకం. శివుడు ఎంతో ఇష్టమైన ఈ చెట్టు కిందనే నివాసం ఉంటాడని భావిస్తారు. అయితే ఈ చెట్టు పవిత్రమైనదే కాదు ఎన్నో ఔషదగుణాలను కలిగిఉంది.మంచి ఔషద గుణలున్న మారేడు చెట్టు పండ్లు, కాయలు, ఆకులు, పువ్వులు, బెరడు, వేర్లను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. మారేడు చెట్టు ఖనిజాలు, విటామిన్లు కలిగి ఉంటుంది.
ఇందులో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, అలాగే విటామిన్ బీ, సీ పుష్కలంగా ఉంటాయి. దీని ఆకుల రసము షుగర్ వ్యాధి నివారణకు చాలా మంచిది. మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరేచనకారిగా కూడా పనిచేస్తుంది.అతిసార వ్యాధితో బాధపడుతున్న వాళ్లకి మారేడు పండ్లు మంచి మందుగా పని చేస్తాయి.ఆయుర్వేదంలో మారేడు వేరును ఉపయోగిస్తారు. మారేడు ఆకుల రసం మధుమేహం ఉన్నవాళ్లు తీసుకోవడం వల్ల మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. బిల్వ ఆకులు రసం తీసి కొంచెం తేనె కలిపి తాగడం వల్ల జ్వరం తగ్గుతుంది. కడుపులో గాని, పేగుల్లో గాని పుండుతో తోబాధపడుతుంటే బిల్వ ఆకుల రసం తీసుకోవడం వల్ల పుండ్లు నయమవుతాయి.
Health Benefits Maredu Tree best leaf heat reduction in body
ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.అలాగే మలేరియాను కూడా తగ్గించే గుణం మారేడు ఆకులకు, ఫండ్లకు ఉంది. రక్త సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వాళ్లు ఈ పండ్ల రసం తీసి అందులోకి కొంచెం అల్లం రసం కలిపి తాగడం వల్ల ఈ సమస్యల నుంచి చక్కటి ఉపషమనం లభిస్తుంది. గుండే, మెదడుకు టానిక్ లా పనిచేస్తుంది. మారేడు ఆకులు, బెరడు ముద్దగా నూరి గాయాల మీద రాయడం వల్ల గాయాలు తొందరగా మానిపోతాయి.బాగా పండిన పండులోని గుజ్జు తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా ఉన్న మలబద్దక సమస్య తగ్గిపోతుంది.హై పవర్ ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవాళ్లు మారేడు ఆకులతో కషాయం చేసుకుని తాగడం వల్ల మంచి ఉపషమనం లభిస్తుంది. అలాగే చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. క్యాన్సర్ కారకాలతో పోరాడుతుంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
Mallapur : ఉప్పల్ Uppal మండలం, మల్లాపూర్ డివిజన్ సూర్యానగర్ ప్రభుత్వ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో Mallapur BabaNagar…
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయంతో ఈ బ్యూటీ…
Sampurna Web Series : ప్రతి శుక్రవారం ఓటీటీలో OTT విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు Web Series ప్రేక్షకులను…
Smuggling : స్మగ్లింగ్ అంటే కొన్ని సినిమాలు మనకు గుర్తుకు వస్తాయి. వాటిలో ఇటీవల అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’…
Rajitha Parameshwar Reddy : బోనాలు Bonalu చేసే ప్రతి ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేయనున్నట్లుగా ఉప్పల్ కార్పొరేటర్…
TDP : నెల్లూరు జిల్లా Nellore విడవలూరులో రాజకీయ ఆవేదన చుట్టుముట్టిన విషాద ఘటన చోటు చేసుకుంది. TDP టీడీపీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన Janasena అధినేత పవన్ కళ్యాణ్ హిందీ భాషకు Hindi…
Actor : చిన్నప్పటినుంచి వెండితెరపై మెరిసిన వ్యక్తి ఇప్పుడు హీరోగా తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా…
This website uses cookies.