Health Benefits : ఈ ఆకు తింటే అన్నీ అద్బుతాలే.. టోట‌ల్ బాడీ డిటాక్సిఫై అవుతుందంట‌.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : ఈ ఆకు తింటే అన్నీ అద్బుతాలే.. టోట‌ల్ బాడీ డిటాక్సిఫై అవుతుందంట‌..

 Authored By mallesh | The Telugu News | Updated on :6 April 2022,7:00 am

Health Benefits : హిందువులు వేప చెట్టు, రావి చెట్టు, మ‌రేడు చెట్టు ఇలా ఎన్నో చెట్ల‌ను ప‌విత్ర‌మైన‌విగా భావించి పూజిస్తారు. ఇలాంటి వృక్షాలలో ఎంతో ముఖ్యమైనది మారేడు చెట్టు. పూర్వకాలం నుంచి మారేడు చెట్టు ప్రాచుర్యంలో ఉంది. ఈ మారేడు చెట్టు అంటే ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరం. మారేడు ఆకులు మూడు ఆకులు కలిపి ఒకే ఈనెల ఉంటాయి. ఇవి ఆ పరమశివుడి మూడు కన్నులను సూచిస్తాయ‌ని హిందువుల న‌మ్మ‌కం. శివుడు ఎంతో ఇష్టమైన ఈ చెట్టు కిందనే నివాసం ఉంటాడని భావిస్తారు. అయితే ఈ చెట్టు ప‌విత్ర‌మైన‌దే కాదు ఎన్నో ఔష‌ద‌గుణాల‌ను క‌లిగిఉంది.మంచి ఔష‌ద గుణ‌లున్న మారేడు చెట్టు పండ్లు, కాయ‌లు, ఆకులు, పువ్వులు, బెర‌డు, వేర్లను ఆయుర్వేదంలో ఉప‌యోగిస్తారు. మారేడు చెట్టు ఖ‌నిజాలు, విటామిన్లు క‌లిగి ఉంటుంది.

ఇందులో కాల్షియం, ఫాస్ప‌ర‌స్, ఐర‌న్, కెరోటిన్, అలాగే విటామిన్ బీ, సీ పుష్క‌లంగా ఉంటాయి. దీని ఆకుల రసము షుగ‌ర్ వ్యాధి నివారణకు చాలా మంచిది. మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరేచనకారిగా కూడా పనిచేస్తుంది.అతిసార వ్యాధితో బాధపడుతున్న వాళ్లకి మారేడు పండ్లు మంచి మందుగా పని చేస్తాయి.ఆయుర్వేదంలో మారేడు వేరును ఉపయోగిస్తారు. మారేడు ఆకుల రసం మధుమేహం ఉన్నవాళ్లు తీసుకోవడం వల్ల మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. బిల్వ ఆకులు రసం తీసి కొంచెం తేనె కలిపి తాగడం వల్ల జ్వరం తగ్గుతుంది. కడుపులో గాని, పేగుల్లో గాని పుండుతో తోబాధపడుతుంటే బిల్వ ఆకుల రసం తీసుకోవడం వల్ల పుండ్లు నయమవుతాయి.

Health Benefits Maredu Tree best leaf heat reduction in body

Health Benefits Maredu Tree best leaf heat reduction in body

Health Benefits : బోలెడ‌న్ని ఔష‌ద గుణాలు..

ఇది శ‌రీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.అలాగే మలేరియాను కూడా తగ్గించే గుణం మారేడు ఆకులకు, ఫండ్ల‌కు ఉంది. రక్త సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వాళ్లు ఈ పండ్ల‌ రసం తీసి అందులోకి కొంచెం అల్లం రసం కలిపి తాగడం వల్ల ఈ సమస్యల నుంచి చ‌క్క‌టి ఉప‌ష‌మ‌నం ల‌భిస్తుంది. గుండే, మెద‌డుకు టానిక్ లా ప‌నిచేస్తుంది. మారేడు ఆకులు, బెరడు ముద్దగా నూరి గాయాల మీద రాయడం వల్ల గాయాలు తొందరగా మానిపోతాయి.బాగా పండిన పండులోని గుజ్జు తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా ఉన్న మలబద్దక సమస్య తగ్గిపోతుంది.హై పవర్ ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవాళ్లు మారేడు ఆకులతో కషాయం చేసుకుని తాగడం వల్ల మంచి ఉప‌ష‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే చ‌ర్మ వ్యాధుల‌ను త‌గ్గిస్తుంది. క్యాన్స‌ర్ కార‌కాల‌తో పోరాడుతుంది.
ర‌క్తాన్ని శుద్ధి చేస్తుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది