Collector : డిజిటల్ యుగంలో సోషల్ మీడియాకి ఆదరణ బాగా పెరిగింది. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు తమ విషయాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొన్ని అయితే ఆటోమెటిక్‌గా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ జిల్లా కలెక్టర్ బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ కు నృత్యం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేరళలోని ఒక జిల్లా కలెక్టర్.. విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్‌లో చేరిన డ్యాన్స్ చేశారు. స్టూడెంట్స్ తో సమానంగా ఎంతో ఉత్సాహంగా స్టెప్స్ వేసిన ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఈ వీడియోలో పాతానంతిట్ట జిల్లా కలెక్టర్ అధికారి దివ్య ఎస్ అయ్యర్ కనిపిస్తున్నారు.కేరళలోని సెంట్రల్ ట్రావెన్‌కోర్ ప్రాంతంలో ఉన్న పతనం తిట్ట ఓ మున్సిపాలిటీ ఆహ్లాదకరమైన ఈ వీడియోలో దివ్య అయ్యర్ రణవీర్ సింగ్ దీపీకా పదుకునే నటించిన గోలియో కీ రాసలీల రామ్‌లీల లోని గాన సాంగ్ ధోల్ పాటకు విద్యార్థులతో కలిసి నృత్యం చేశారు. విద్యార్థులతో కలిసి దివ్య పాటను ఎంజాయ్ చేస్తూ.. చక్కగా డ్యాన్స్ చేశారు. మహత్మాగాంధీ యూనివర్సిటీ ఆర్ట్ ఫెస్టివల్‌ను ప్రకటించింది. ఈ తరుణంలో జిల్లా స్టేడియంలో కళాశాల విద్యార్థులు ప్లాష్ మాబ్‌ను ఏర్పాటు చేశారు.
ఫెస్టివల్ ను దీప ప్రజ్వలనంతో ప్రారంభించడానికి వేదిక మీదకు ఐఏఎస్ అధికారిని దివ్య రావడంతో.. స్టూడెంట్స్ తమతో పాటు డ్యాన్స్ చేయమని కలెక్టర్ ను కోరారు. దీంతో స్టూడెంట్స్ తో పాటు దివ్య జాయిన్ అయ్యారు.స్టూడెంట్స్ చాలా చక్కగా డ్యాన్స్ చేశారని కలెక్టర్ దివ్య పేర్కొన్నారు. వారి ఎనర్జీ చూసి ముచ్చట వేసిందని తెలిపింది. తాను విద్యార్థిగా ఉన్న సమయంలో కూచిపూడి, ఒడిస్సి, కథకళి, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నానని తెలియజేసింది. నిజమే.. ఓ కలెక్టర్ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేయడం.. వారు ఎంకరేజ్ చేయడం బాగుంది. ఆ వీడియోకు నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. కలెక్టరమ్యా యూవర్ గ్రేట్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.