Health Benefits : నేరేడు పండ్లు ఎక్కువగా ఎండాకాలం ముగుస్తున్న సమయంలో బాగా దొరుకుతాయి. గ్రామాలలో ఎక్కువగా ఈ నేరేడు చెట్లు కనిపిపిస్తాయి. ఇవి చూడడానికి నల్లగా కనిపిస్తాయి. కాని రుచి ఎంతో బాగుంటుంది. ఇవి వేసవికాలం లోనే ఎక్కువగా పండుతాయి. తరువాత సీజన్ లో దొరకవు. కనుక ఈ సీజన్ లోనే వీటిని తినాలి. నేరేడు పండ్లను ఇండియన్ బ్లాక బెర్రీ లేదా జామున్ అంటారు. అంతేకాకుండా, ఈ పండ్లను జావా ప్లమ్ అని కూడా పిలుస్తారు. ఈ పండ్లు మార్కెట్లో ఈ కాలం బాగా కొనుగోలు అవుతాయి. నేరేడు పండ్లలో ఆయుర్వేదానికి చెందిన ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వివిధ రకాల రోగాల బారిన పడకుండా కాపాడుతాయి. అందుకే వీటి రేటు ఎక్కువగా ఉన్న ఆరోగ్యపరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయని తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం, నేరేడు పండ్ల వలన మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది.
నేరేడు పండ్లను తినడం వలన మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే రక్తంలోని చక్కెరను పెరగకుండా, తగ్గకుండా నియంత్రణలో ఉంచుతాయి. నేరేడు పండ్లు మాత్రమే కాదు, వాటి ఆకులు కూడా చాలా ఉపయోగకరమైనవి. వీటి ఆకులు వివిధ రకాల రోగాలను మనకు రాకుండా చేస్తాయి. అయితే ఈ నేరేడు పండ్లతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని వైద్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.ఎందుకంటే నేరేడు పండ్లు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో, అంత కీడును కూడా చేస్తాయి. అయితే వీటిని ఎక్కువగా తింటే ముఖ్యంగా ఈ నాలుగు సమస్యలు ఎక్కువగా వస్తాయంట. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… మొదటిగా ఈ నేరేడు పండ్లను రుచిగా బాగున్నాయి కదా అని ఎక్కువగా తింటే మన చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతాయి. నేరేడు పండ్ల వలన ముఖంపై మచ్చలు, మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే జుట్టు కూడా ఎక్కువగా రాలిపోయో ప్రమాదం ఉంది.
అందుకే నేరేడు పండ్లను ఎక్కువగా తినకపోవడం చాలా మంచిది. రెండవది కొంతమందికి నేరేడు పండ్లు పడవు. వాటి వాసనను చూస్తేనే వికారవగా ఫీలవుతారు. అలాంటప్పుడు ఈ పండ్లను తినకుండా ఉండడమే మంచిది. ఎవరైన బలవంతంగా తినిపిస్తే తరువాత వాంతులు చేసుకునే అవకాశం ఉంది. కనుక నేరేడు పండ్లను తినకుండా ఉండడమే ఆరోగ్యానికి మంచిది. హైబీపి ఉన్నవారు నేరేడు పండ్లను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కాని వీటిని అధికంగా తిన్నారంటే మరొక సమస్యను తెచ్చుకున్నట్లే. ఎందుకంటే నేరేడు పండ్లను ఎక్కువగా తింటే లోబీపి సమస్య వస్తుంది. అంటే బీపి ఉండాల్సిన దాని కంటే తక్కువగా పడిపోతుంది. కనుక నేరేడు పండ్లను మరి ఎక్కువగా కాకుండా, మరి తక్కువగా కాకుండా తినాలి. సరిపోను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక నాలుగవది కోందరికి మలబద్ధకం సమస్య ఉంటుంది. అలాంటి వారు నేరేడు పండ్లను ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా తింటే ఆ సమస్య ఇంకా ఎక్కువగా బాధిస్తుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.